“మహర్షి”..మూడు లుక్స్ తో మహేష్ గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు..?

Thursday, December 6th, 2018, 02:01:45 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్,అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్ “మహేష్ బాబు” నుంచి భరత్ అనే నేను చిత్రం తర్వాత రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ “మహర్షి”. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం మీద ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు ఒక విద్యార్థిగా,ఒక బిజినెస్ మ్యాన్ గా మరియు ఒక రైతుగా ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారు అన్న సంగతి తెలిసినదే.ఇప్పుడు ఈ మూడు విభిన్న పాత్రలకు సంబంధించి మరొక కొత్త ఆసక్తికర అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఒక్కొక్క పాత్ర వేర్వేరు ప్రదేశాలకు చెందినది గా ఉండబోతున్నట్టు సమాచారం.డెహ్రాడూన్ లో స్టూడెంట్ గా,అమెరికాలో ఒక బిసినెస్ మ్యాన్ గా మరియు ఇక్కడే ఒక గ్రామంలో రైతుగా కనిపించబోతున్నారు అని తెలుస్తుంది.ఇప్పటివరకు షూటింగ్ అయిన ప్రదేశాలకు అనుగుణంగా ఈ సమాచారాన్ని మనం ఒక అంచనా వెయ్యొచ్చు అంతే కాకుండా ఆ మధ్య సోషల్ మీడియాలో విడుదలైన ఫోటోలను బట్టి చూసుకున్నా సరే ఈ వార్త నిజమే అనిపిస్తుంది.ఇప్పుడు ఈ వార్త తెలుసుకున్నటువంటి మహేష్ యొక్క అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.