“మా” రచ్చ.. చిరు ఆగ్రహం – మహేష్ డ్రాప్!

Thursday, September 6th, 2018, 09:58:58 AM IST

తెలుగు మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ (మా) గత కొంత కాలంగా పలు వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారం నుంచి శ్రీ రెడ్డి ఇష్యు వరకు మా వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలపాలయ్యేలా చేసింది. ఇక రీసెంట్ గా నిధుల దుర్వినియోగం అంటూ వచ్చిన విమర్శలు మా ప్రతిష్టను దిగజార్చాయని అనేక కథనాలు వెలువడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా నిధులను దుర్వినియోగం చేశారంటూ ప్రముఖ ఆంగ్ల పత్రికలో కథనం వెలువడగా సంఘం కార్యదర్శి నరేష్ ఆ కథనానికి మద్దతు ఇచ్చారు.

దీంతో మా కమిటీలో చీలికలు ఏర్పడ్డాయి. అయితే ఈ గొడవల్లో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ప్రస్తావనకు రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో అమెరికా ఈవెంట్ లో మెగాస్టార్ పాల్గొని మా అసోసియేషన్ కు తోడ్పడ్డారు. ఇక అమెరికాలో మహేష్ బాబుతో కూడా మా సంఘం ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. అయితే వివాదాల కారణంగా మహేష్ బాబు కూడా ఈవెంట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. అక్టోబర్ లో ఈవెంట్ కోసం ప్లాన్ చేసుకున్న మా సబ్యులకు మహేష్ నిర్ణయం భారీ దెబ్బె అని ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments