ఫ్యాన్ పెళ్లికి మహేష్ స్పెషల్ గ్రీటింగ్స్!

Saturday, May 5th, 2018, 06:26:05 PM IST

రీసెంట్ గా భరత్ అనే నేను సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. సినిమాకు సంబందించిన వేడుకలలో పాల్గొంటూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతే కాకుండా అభిమానులు కూడా స్పెషల్ గా కలుసుకుంటున్నాడు. ఇకపోతే రీసెంట్ గా ఒక లేడి ఫ్యాన్ పెళ్లి సందర్బంగా మహేష్ – నమ్రత స్పెషల్ గ్రీటింగ్ కార్డు పంపారు. సులేక అనే అమ్మాయి మహేష్ కు పెద్ద అభిమాని. అయితే ఆమె పెళ్లి కార్డును స్పెషల్ గా డిజైన్ చేసి మహేష్ బాబుకి పంపించగా మహేష్ ఒక గ్రీటింగ్ కార్డు పై స్పెషల్ విషెష్ అని చెబుతూ రాసి పంపించాడు.

అయితే మహేష్ నుంచి గ్రీటింగ్ కార్డు రావడంతో సులేక ఒక్కసారిగా పెళ్లి పందిరిలోనే ఆశ్చర్యానికి గురైంది. అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా అభిమానుల నుంచి లేఖలు వస్తే వాటికి సమాధానం ఇస్తూ అభిమానులకు కూడా ఉత్తరం రాసేవారు. ఓ విధంగా మహేష్ కూడా ఆ స్టైల్ ఫాలో అవుతూ అభిమానులు మరింత దగ్గరవుతున్నాడని చెప్పాలి.