మరోసారి అభిమానులను సిద్ధంగా వుండమంటున్న మహేష్ బాబు!

Friday, May 25th, 2018, 09:45:50 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన సూపర్ హిట్ చిత్రం భరత్ అనే నేను. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం చిత్రాల పరాజయాల తర్వాత ఎలాగైనా అభిమానులకు తప్పక హిట్ ఇవ్వాలని కసితో మహేష్ బాబు మరొక్కసారి కొరటాలకు అవకాశం ఇచ్చారు. అయితే అనుకున్నట్లుగానే కొరటాల శ్రీమంతుడు మించిన విజయాన్ని భరత్ అనే నేను రూపంలో మహేష్ అభిమానులకు అందించారు. ఈ చిత్రం విడుదలయిన తొలి రోజు నుండి సూపర్ డూపర్ హిట్ టాక్ తో అన్ని కేంద్రాల్లో అద్భుతమైన కలెక్షన్లతో దూసుకువెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటిన ఈ చిత్రం కొన్ని కేంద్రాల్లో ఇంకా స్టడీగా రన్ అవుతోంది.

చిత్రం అద్భుత విజయం అందుకోవడంతో మహేష్ బాబు ప్రస్తుతం కుటుంబంతో సహా స్పెయిన్ కు విహార యాత్రకు వెళ్లారు. కాగా ప్రస్తుతం మహేష్ అభిమానులను మరొకమారు సిద్దంకామ్మంటున్నారు. అదేమిటంటే తెలుగులో విడుదలయిన భరత్ అనే నేను అటు తమిళనాడు, ఇటు కేరళలోని కలెక్షన్ల దుమ్ము దులిపింది. చెన్నై నగరంలో అయితే ఏకంగా రూ.1.70 కోట్ల షేర్ ను సాధించి అక్కడ బాహుబలి-2 రికార్డును సైతం బీట్ చేసింది. ఇక కేరళలో కూడా కేవలం పది రోజుల్లో పది లక్షల రూపాయల కలెక్షన్ కొల్లగొట్టి హయ్యెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాగా నిలిచిందని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. కాగా ఈ చిత్రం నేడు అనగా మే 25న తమిళ అలానే మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయాలనుకున్నారు.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డేట్ ఈనెల 31కి మారింది. ఇందులో ఒక గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఏప్రిల్ 20 మహేష్ తల్లిగారైన ఇందిరమ్మ జన్మదినం రోజున విడుదలయి తెలుగు వర్షన్ విడుదలయి సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇక తమిళ, మలయాళ వెర్షన్స్ విడుదల తేదీ అయిన 31 న లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం కావడంతో ఈ రెండు వర్షన్లు కూడా తప్పకుండ మంచి విజయాన్ని సాధిస్తాయని, అందునా ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాల్లో తెలుగు వర్షన్ అద్భుత విజయం సాధించడంతో యూనిట్ కూడా తప్పక హిట్ అవుతుందని గట్టినమ్మకంతో వుంది……

  •  
  •  
  •  
  •  

Comments