గౌరవంతో ఉచితంగా మహానటిని చుడండి: చిత్ర యూనిట్

Wednesday, May 23rd, 2018, 11:14:03 PM IST

సావిత్రి బయోపిక్ మహానటి సినిమాకు ప్రస్తుతం అందుతోన్న ఆధారణ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు అందలేదు అనే చెప్పాలి. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాకు వెళుతున్నారంటే సావిత్రి పై ఇంకా అభిమానం ప్రేమస్థిరంగా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అప్పట్లో సావిత్రి అభిమానులుగా ఆమెను ఆదరించిన ఇప్పటి పెద్దవారు ఏ మాత్రం అలసిపోకుండా సినిమాను చూడటానికి వెళుతున్నారు. ఎప్పుడు లేనిది వృద్దులు కూడా సినిమా థియేటర్స్ ముందు కనిపిస్తున్నారు.

ఇకపోతే అమెరికాలో కూడా సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే అక్కడ సినిమాను విడుదల చేసిన నిర్వాణ సంస్థ ప్రవాస వృద్దులకు సినిమాను ఉచితంగా చూపించాలని డిసైడ్ అయ్యారు. ‘పెద్దవారిని గౌరవిస్తూ.. 55 ఏళ్లకు పైబడన వారు యూఎస్ లో ఈ శనివారం (5/26), ఆదివారం (5/27) సావిత్రి ‘మహానటి’ సినిమాను ఉచితంగా చూడవచ్చు అని ఒక ప్రకటన విడుదల చేశారు. థియేటర్స్ పేర్లను కూడా ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా వైజయంతి మూవీస్ ఈ విష్యాన్నికఁ తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments