తెలంగాణ రాష్ట్రమంత్రివర్గ సమావేశంలోని కీలకాంశాలు ఇవే!

Sunday, September 2nd, 2018, 04:34:35 PM IST

తెలంగాణ ప్రజల సంక్షేమమే ద్యేయంగా ముందుకు సాగుతున్న ఆ పార్టీ అధినేత మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కొద్దిరోజులనుండి పార్టీ అంతర్గత కార్యక్రమాలపై మరింత దృష్టిపెట్టారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర అవడం, అందునా మరొకవైపు ముందస్తు ఎన్నికలకు సంకేతాలు కూడా వెలువడుతుండడంతో, పార్టీని మరింత పటిష్టపరిచేవిధంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. అందులో భాగంగా నేడు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్, పార్టీ సభ్యులు మరియు అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ సమావేశం అనంతరం ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామని, ప్రజా సంక్షేమం దృష్ట్యా తమ పార్టీ కొన్ని నూతన పధకాలు కూడా రూపొందిస్తూ వారికీ మరింత మేలుచేసే విధంగా వాటిని రూపొందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాక ఎప్పటినుండో రూ.3500 వంతున నెలకు జీతాలు అందుకుంటున్న గోపాల మిత్రలకు రూ. 8500 మేర వేతనాన్ని పెంచుతున్నట్లు, అలానే కంటివెలుగు కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోందని, ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక బిసిల ఆత్మగౌరవ భవన నిర్మణాలకు ఆమోదం తెలిపామని, వాటికిగాను 71 ఎకరాల్లో దాదాపు రూ.71 కోట్లతో ఆ భావన నిర్మాణాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేసారు.

ఇక ఎన్నాళ్ళనుండో ప్రధానంగా వినిపిస్తున్న అర్చకుల ప్రధాన సమస్య అయినా పదవి విరమణ వయసుపెంపుదల విషయమై కూడా నిర్ణయం తీసుకున్నామని, ఇకపై అర్చకుల పదవి విరమణ 58సంవత్సరాలు కాక 65ఏళ్లుగా నిర్ణయించడం జారిందని అయన చెప్పారు. అలాగే ఎన్యూహెచ్ఎంలో పనిచేస్తున్న దాదాపు 9వేలమంది ఉద్యోగులకు కనీసవేతనం పెంచే విధంగా కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. అయితే దీని తరువాత మరొక క్యాబినెట్ సమావేశం ఉంటుందని, ఆ సమావేశంలో ఇప్పుడు చర్చించిన అంశాలపై తుది నిర్ణయం వెలువడుతుందని, టిఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ అని ఆయన చెప్పారు…..

  •  
  •  
  •  
  •  

Comments