దుర్గాడ నాగన్న చనిపోవడానికి అసలు కారణమదే : అటవీశాఖ

Wednesday, August 8th, 2018, 09:59:31 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల దుర్గాడ గ్రామంలో ఒక పాము మరణించిన సంగతి తెలిసిందే. 26 రోజులుగా ఒకే చోట ఉండి మరణించిన పామును చూసి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపమని కొలిచిన గ్రామస్తులు ఆ పాముకు భక్తి శ్రద్దలతో పూజలు చేసి ఖననం చేశారు. అయితే పాము మరణించడానికి గల కారణం పోలీసులని, మీడియా కూడా మరో కారణమని వివిధ రకాల ఆరోపణలు గ్రామస్తుల నుంచి వచ్చాయి. అయితే అసలు ఆ పాము చనిపోవడానికి గల కారణాన్ని అటవీశాఖ అధికారులు నివేదికలో తెలిపారు.

ఉన్నతాధికారులకు ఇచ్చిన ఆ నివేదికలో పాము ముసలిదని అలాగే కుబుసం విడిచే క్రమంలో అక్కడే ఉండిపోయింది. దాంతో నీరసంగా ఉండడంతో ఆ సర్పం ప్రాణాలు విడిచిందని ఉన్నతాధికారులకు నివేదిక అందింది. అదే విధంగా పాముకు వైద్యం అందించడానికి గాని దాన్ని అడవిలోకి తరలించేందుకు గాని గ్రామస్తులు ఒప్పుకోలేదు. ఇక ఆ పాము ఎవరని కాటేయలేదని పామును కూడా ఎవరు గాయపరచలేదు గనక ఎవరిపైన కేసులు నమోదు చేయలేదని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ముందుగానే పామును అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఉందని స్థానిక ఎమ్మెల్యేకు తెలిపినప్పటికీ గ్రామ ప్రజలు దైవంలా కొలుస్తున్న నేపథ్యంలో వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎమ్మెల్యే చెప్పినట్లు నివేదికలో వివరణ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments