మక్కా మసీదు పేలుళ్ల కేసును కొట్టేసిన న్యాయస్థానం

Monday, April 16th, 2018, 01:24:35 PM IST

2007 మే 18న జరిగిన మక్కా మసీదు బాంబ్ బ్లాస్ట్ ఘటన ఎంత సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. పదేళ్లకు పైగా న్యాయస్థానంలో ఈ కేసు సాగుతూనే ఉంది. అయితే నాంపల్లి కోర్టు ఈ రోజు కేసుపై సంచలన తీర్పును ఇచ్చింది. కేసును కొట్టివేస్తున్నట్లు చెప్పడంతో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అప్పట్లో ఈ ఘటనలపై మొదట హుస్సేనీఆలం ఠాణాలో కేసులు నమోదవ్వగా కేసు దర్యాప్తు సీబీఐ ఆధీనంలోకి వెళ్లింది.

అయితే ఆ తరువాత ఉగ్రవాద దుశ్చర్య అని తెలియడంతో హోంమంత్రిత్వ శాఖ కలుగజేసుకొని 2011 ఏప్రిల్‌ 4న నేషనల్ ఇన్వెస్టిగేషన్ (ఎన్‌ఐఏ) సంస్థ చేతిలో పెట్టారు.
దీంతో 10 మంది నిందితుల్ని ఎన్ఐఏ గుర్తించి కేసు నమోదు చేసింది. ఇక నిందితులపై 2014లో ఫిబ్రవరి 3న అభియాగాలు నమోదయ్యాయి. సిబీఐ ఒకటి, ఎన్‌ఐఏ రెండు అభియోగపత్రాల్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో మక్కా మసీదు పేలుడు మధ్యాహ్న సమయంలో జరిగింది. ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌ (ఐఈడీ) పేలుడు ధాటికి 9 అంది అక్కడిక్కడే మరణించగా 58 మంది గాయపడ్డారు. ఘటన తరువాత మత కల్లోలం మొదలవ్వడంతో పోలీసులు అదుపుచేయలేకపోయారు. అప్పుడు మరో అయిదు మంది కాల్పుల్లో చనిపోయారు.