ఫోటో స్టోరి : హాట్ ఎఫైర్ క‌హానీ

Saturday, November 17th, 2018, 02:01:13 PM IST

రంగుల ప్ర‌పంచంలో ఎఫైర్ క‌హానీల గురించి విడిగా చెప్పాల్సిన ప‌నేం ఉండ‌దు. క‌లిసి న‌టిస్తే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో ఉందంటూ గుస‌గుస‌లు మొద‌లైపోవ‌డం స‌హ‌జ‌మే. అయితే ఈ ఎఫైర్ క‌హానీ మాత్రం అందుకు పూర్తి డిఫ‌రెంట్‌. త‌న‌కంటే వ‌య‌సులో చిన్న‌వాడైన అర్జున్ క‌పూర్ తో బాలీవుడ్ క‌థానాయిక మ‌లైకా అరోరాఖాన్ ఎఫైర్ సాగిస్తోంద‌న్న‌ది అంత‌కంత‌కు అగ్గి రాజేస్తోంది. ఈ ప్ర‌చారంపై అటు అర్జున్ కానీ, ఇటు మలైకా కానీ స్పందించిందే లేదు. అలాగ‌ని ఖండించ‌నూ లేదు. ఎవ‌రి ప‌ని వాళ్ల‌దే అన్న చందంగా ఉంది వ్య‌వ‌హారం.

ఓవైపు మ‌లైకా అరోరాఖాన్ .. అర్జున్‌తో చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్లు చేస్తుంటే, వేరొక‌వైపు కొత్త‌ గాళ్‌ఫ్రెండ్ జార్జియా ఆండ్రియానీతో ఆర్బాజ్ సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నాడు. ఇటీవ‌లే శిల్పాశెట్టి దీపావ‌ళి విందులోనూ ఈ జంట సంద‌డి చేశారు. మ‌లైకా అరోరాఖాన్ కి విడాకులిచ్చిన ఆర్భాజ్ అటుపై త‌న‌కు న‌చ్చిన గాళ్‌ఫ్రెండ్‌తో షికార్లు చేయ‌డంపై మీడియా క‌థ‌నాలు హోరెత్తిపోతున్నాయి. అయితే మ‌రీ ఇంత డీప్‌గా వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి మీడియా చొచ్చుకెళ్ల‌డం అంత క‌రెక్ట్ కాద‌న్న విమ‌ర్శలు వ‌స్తున్నాయి. వ్య‌క్తిగ‌త విష‌యాలు మాట్లాడేందుకు ఆస‌క్తి లేద‌ని, త‌న‌ని ఇలాంటి ప్ర‌శ్న‌లు అడ‌గొద్ద‌ని మ‌లైకా ప‌లుమార్లు సూటిగానే చెప్పింది. జీవితం ఎంతో విలువైన‌ది.. అంద‌మైన‌ది.. దానిని ఆస్వాధిస్తున్నాన‌ని ఓపెన్‌గానే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడ‌డం చ‌ర్చ‌కొచ్చింది.