అమ్మాయిల అత్యాచారంపై మల్లికా వినూత్న ప్రచారం చూశారా..?

Tuesday, May 15th, 2018, 12:00:36 PM IST

కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలు మే 8న ఫ్రాన్స్ లో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలకి చాలామంది బాలీవుడ్ మరియు హాలీవుడ్ సినీ నటీ నటులు, దర్శక నిర్మాతలు, తదితర ప్రముఖులు పాల్గొనడానికి వచ్చారు. ప్రతీ నటీ నటులు ఒక్కో రీతిలో వారి పర్ఫార్మెన్స్ ను వేదికపై చేసి చూపుతుంటే ఈ సంవత్సరం మల్లికా శరావత్ మాత్రం కాస్త కొత్తగా కేన్స్ వేడుకలు మొత్తం ఆమె వైపుకు తిరిగి చూసేలా ఓ వైవిధ్యమైన ప్రదర్శన చేసింది. ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక బోనులో కూర్చొని బయట వైపు నుండి దానికి తాళం వేసుకొని లోపలే ఉండిపోయారు. ఇదంతా ఎందుకని ప్రశ్నించగా ఈ ఏడు మల్లికా శరావత్ “ఫ్రీ గర్ల్” అనే ఓ ఎన్జీఓ తరపునచిన్నారి బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై ఈ వేదికపై ప్రచారం చేయడానికి సిద్దపదిందట. ఎందుకు.. ఏమిటీ.. ఎలా అన్న వివరాలు తన మాతల్లోప్నే విందాం.

నేను కేన్స్ లో పాల్గొనడం ఏది తొమ్మిదో సారి. చిన్నారి బాలికలపై జరుగుతున్నఅత్యాచారాలు, కొందరి మగవారి ఆకృత్యాలు ఒక్క భారతదేశంలోనే కాకుండా ఇంకా కొన్ని దేశాలలో కూడా భారీ స్తాయిలో జరుగుతున్నాయి. దానికి సంబంధించి యావత్ ప్రపంచానికి ఒకే సారి అవగాహన కల్పించడానికి ఇదొకటే సరైన వేదిక అని అనుకున్నాను. అందికే నాకు నేనే ఇలా బందించుకొని నా వంతు సహాయంగా నేను ఈ విధంగా ప్రచారం చేస్తున్నాను. ఇదొకటే కాకుండా అన్యాయంగా ఎందరో చిన్న పిల్లలను బలవంతంగా ఈడ్చుకు పోతుంటే ఆ పిల్లలు పడుతున్న బాద ఎలా ఎంతుందో నాకు తెలుసు, ఎవరి సాయం లేకుండా ఎక్కద ఉన్నారో, ఎలా ఎన్నారో అసలు వాళ్లకి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా చస్తూ బ్రతుకుతున్నారు. ఈ ప్రపంచంలో ప్రతీ నిమిషానికి సుమారు నలుగు అమ్మాయిలూ లేదా బాలికల చొప్పున ఎ క్రూరులకు బలవుతున్నారు. ఎక్కడికి పారిపోలేక, ఏం చేయాలో తెలియక వేజారిపోయిన జీవితాలతో ఆకలి చావులతో బ్రతుకుతున్నారు. ఇంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఈ ప్రపంచాన్ని చూసి నా కడుపు తలుక్కుపోయి కనీసం నాతో అయినంత సాయం అయినా నేను చేయాలనుకున్నాను. ఇలానే ఊరుకుంటూ పొతే ప్రపంచమంతటా ఈ నీచమైన వ్యాధి సోకి అమ్మాయిల అమ్మకాలు, చిన్నపిల్లలపై, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతాయి. అని మల్లికా శరావత్ అన్నారు.

Comments