సచిన్ కుమార్తెకు వేధింపులు.. ఇంటికే 20 సార్లు ఫోన్ కాల్..!

Sunday, January 7th, 2018, 10:20:22 PM IST

సచిన్ కుమార్తె సారా వేధింపులకు గురయ్యారు. ఓ దుండగుడు సచిన్ ఇంటి ల్యాండ్ లైన్ నంబర్ కు పలుమార్లు ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. తనని పెళ్లి చేసుకోకుంటే కిడ్నాప్ చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. దీనితో సారా పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీస్ లు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన దేవ్ కుమార్ గా పోలీస్ లు గుర్తించారు. ఫోన్ లో పెళ్లి చేసుకోవాలని బెదిరించడం, అసభ్యంగా మాట్లాడడంతో సారా పోలీస్ లకు ఫిర్యాదు చేసారు. డిసెంబర్ 5 నే కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కాగా నేడు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దేవ్ కుమార్ మానసిక పరిస్థితి సరిగా లేదని అతడి కుటుంబ సభ్యులు వివరించారట.