వీడియో : ఐఫోన్ తో ప్రయోగాలు చేస్తే ముఖం పచ్చడే..!

Wednesday, January 24th, 2018, 04:03:27 PM IST


స్మార్ట్ ఫోన్ అనేది మనిషిలో ఓ శరీర భాగంలాగా అయిపోయింది. స్మార్ట్ ఫోన్ కి అలవాటు పడ్డ వాళ్లు దానిని గంట పక్కన పెట్టి ఉండడం కష్టం. ఐఫోన్ అనేది స్మార్ట్ ఫోన్ లలో రారాజు. ఐఫోన్ ధర ఏస్థాయిలో ఉంటుందో దాని నాణ్యత కూడా అదేవిధంగా ఉంటుంది. అందుకే ఆపిల్ సంస్థ ఉత్పత్తి చేసే ఐఫోన్ కు అంతర్జాతీయంగా భారీ మార్కెట్ ఉంది. ఐఫోన్ లో కొత్త సిరీస్ వచ్చిందంటే కొనడానికి జనాలు ఎగబడతారు. ఎంత నాణ్యత ఉన్న వస్తువునైనా వాడే విధంగానే వాడాలి లేకుంటే తేడాలు జరిగిపోతాయి. చైనాలోని ఓ వ్యక్తికి ఐఫోన్ వలన వింత అనుభవం ఎదురైంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంచి బ్రాండ్ వాల్యూ కలిగిన వస్తువులకు నకిలీ బ్రాండ్ లు వస్తున్నాయి. చైనాలో కూడా ఈ బెడద ఉంది. ఇటీవల ఐఫోన్ కొన్న ఆవ్యక్తి దాని నాణ్యత పరీక్షించేందుకు ఓ మొబైల్ స్టోర్ కు వెళ్లాడు. బ్యాటరీని తీయవలసిన పద్ధతిలో తీయకుండా నోటితో పట్టుకుని లాగాడు. బయటకు తీసిన మరుక్షణం అది పేలిపోయింది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్గా మారింది. అతడు కొన్న ఐఫోన్ నిజంగానే నకిలీదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అతడివద్ద ఉన్నది నకిలీ ఫోనే కావచ్చు.. కానీ బ్యాటరీని నోటితో బయటకు లాగడం సరైన పద్దతి కాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. బ్యాటరీ పేలిన సమయంలో అక్కడున్నవారికి తృటిలో ప్రమాదం తప్పింది.