షాక్: గుండెల్లో కత్తి.. అయినా భయపడకుండా వెళ్లాడు

Saturday, October 14th, 2017, 10:03:04 AM IST

ఎంతటివారైనా చావు ఎదురుగా వస్తే భయపడకుండా ఉండలేరు. కానీ ఒక వ్యక్తి చావు ఎదురైనా భయపడకుండా ప్రాణాలను రక్షించుకోవడానికి ధైర్యంతో ముందుకు సాగాడు. గుండెల్లో కత్తి దిగినా రక్తం ఏరులై పారుతున్నా ఏ మాత్రం అదరకుండా హాస్పిటల్ కి నడుచుకుంటూ వచ్చాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూ యార్క్ సిటీలో ముహమ్మద్ రమీరెజ్ (35) అనే వ్యక్తి కత్తి పోటుకు గురయ్యాడు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు కానీ ఆ వ్యక్తి ఛాతిలో కత్తి సగం వరకు దిగింది. దీంతో అతన్ని చూసిన స్థానికులు అందరు భయపడిపోయారు. ఎవ్వరు దగ్గరికి రావడానికి కూడా భయపడలేదు. దీంతో రమీరెజ్ ఐదు బ్లాకుల తరువాత ఉన్న క్వీన్స్ హాస్పిటల్ కి ఛాతిలో దిగిన కత్తితో నడుచుకుంటూ వెళ్లాడు. అది చూసిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే అతన్ని వైద్యాన్ని అందించారు. ప్రస్తుతం ఈ వార్త అమెరికాలో సంచలనంగా మారింది. అయితే అతని ప్రాణాలకు ప్రమాదం ఏమి లేదని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు.