నాలాలో కొట్టుకుపోయిన యువకుడు.. హైదరాబాద్ వాసులు..జర జాగ్రత్త..!

Sunday, October 15th, 2017, 01:05:17 AM IST


గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరం వర్షాలతో తడిసి ముద్దవుతోంది. నగరంలో డ్రైనేజి సిస్టం, రోడ్లు అద్వాన స్థితి లో ఉన్నాయి. కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారుతున్నాయి. రోడ్లపై నడవాలంటే జనం భయంతో వణికి పోతున్నారు. అడుగు తీసి పెడితే ఏమవుతుందో అనే భయం అందరిలో నెలకొని ఉంది. వర్ష ప్రవాహాల నుంచి రక్షించే సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ తెరచి ఉంచుతున్నారు.

తెరచి ఉన్న నాలా కారణంగా చింతల్ మధుసూదన్ రెడ్డి నగర్ లో ఓ యువకుడు ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. కల్వర్టు పై వెలుస్తున్న సమయంలో నాలా తెరచి ఉండడంతో ఓ యువకుడు అందులో జారి పడిపోయాడు. అధికారులు యువకుడిని రక్షిణించే ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రేనేజీ వ్యవస్థ గణేష్ నగర్ వైపు ఉండడంతో అక్కడ యువకుడి కోసం గాలింపు జరుగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments