పెళ్లి చూపులకు వచ్చి.. అమ్మాయి అక్కని ఎత్తుకెళ్లాడు!

Friday, June 1st, 2018, 05:05:18 PM IST

పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయిని చూసిన యువకుడు ఆమె అక్కను లేపుకుపోయి అందరిని షాక్ కు గురి చేశాడు. పెళ్లి చేసుకొని ఉన్న ఆ యువతికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ యువతిని లేవదీసుకుపోయిన ఘటన చెన్నైలో సంచలన సృష్టించింది. దీంతో మహిళ తండ్రి చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించాడు. అసలు వివరాల్లోకి వెళితే..చెన్నై మైలాపూరు ఏకాంబరం పిళ్‌లై వీధికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే మొదటి కూతురు పెళ్లి నాలుగేళ్ల క్రితమే జరిగింది.

ఇక రెండవ కూతురి పెళ్లి కూడా తొందరగా చేయాలనీ ఆ వ్యక్తి ఈ ఏడాది మొదట్లో జనవరిలో పెళ్లి చూపులు నిర్వహించాడు. అయితే అమ్మాయిని చూసిన తరువాత యువకుడు పెళ్లి కూతురు అక్కతో కూడా మాట్లాడాడు. పరిచయం కూడా పెంచుకున్నాడు. అయితే ఆ తరువాత తండ్రికి ఏ సమాచారం చెప్పకుండా పెద్ద అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ ఆమెకు దగ్గయ్యాడు. అయితే ఫైనల్ గా బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మూడేళ్ల కొడుకుతో అతనితో వెళ్ళిపోయింది. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఇంట్లో ఉన్న బంగారం అలాగే 2 లక్షల డబ్బును తీసుకొని వెళ్లిపోయారని పిర్యాదు చేయగా ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments