దారుణం: పెళ్లి కావట్లేదని ఆ అమ్మాయిని చంపేశాడు!

Tuesday, April 3rd, 2018, 01:55:50 PM IST

కొందరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి దారుణాన్ని మిగులుస్తాయో ఒక ఘటన ఇటీవల నిరూపించింది. అలాగే అనుమానం ఎంత భయంకరంగా ఉంటుందో కూడా ఘటన ద్వారా రుజువయ్యింది. ఎవరు ఊహించని విధంగా పక్కింటి వాడే హత్య చేయడం ఛత్తీస్ ఘడ్ ప్రాంత వాసులను షాక్ కు గురి చేసింది. తనకు పెళ్లి కానివ్వకుండా అమ్మాయి అడ్డుపడుతోందని ఆ వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు.

అసలు వివరాల్లోకి వెళితే.. రాయ్‌పూర్‌కి చెందిన పింటు అనే యువకుడు పెళ్లి చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్నో పెళ్లి చూపులకు వెళ్ళాడు. దాదాపు రీసెంట్ గా 12 సార్లు పెళ్లి చూపులకు వెళ్లగా ఏ సంబంధం కూడా సెట్ కాలేదు. అమ్మాయిలు అతన్ని చూసి నచ్చలేదు అని చెప్పడం జరుగుతూనే ఉంది. ఇక కొంత కాలానికి పింటూ తనకు పెళ్లి జరగకపోవడానికి పక్కింటి అమ్మాయే అని అనుమాన పడ్డాడు. ఆ అమ్మాయి చేతబడి చేయడం వల్లనే తనకు పెళ్లి కావడం లేదని ఊహాగానాలను నమ్మాడు. చివరికి ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. దీంతో ఆ అమ్మాయి ఇంట్లో ఎవరు లేని సమయంలో పింటు ఆమెను తీవ్రంగా గాయపరిచి చున్నీతో గొంతు నులిమేశాడు. దీంతో అక్కడికక్కడే ఆ యువతి ప్రాణాలను కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడు పారిపోతుంటే గ్రామస్థుల సాయంతో పట్టుకొని అరెస్ట్ చేశారు.