పేకాటలో పెళ్లాన్నే పోగొట్టుకున్నాడు..చివరికి..

Wednesday, March 28th, 2018, 04:53:10 PM IST

జూదం ఎంత చెడ్డదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరిత్ర చూసుకుంటే దాని వల్ల రాజ్యాలే పోయాయి. మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణానికి దారి తీసిన జూదం వల్ల అనర్దాలే కానీ లాభాలు ఉన్నట్లు ఏ కథ చెప్పలేకపోయింది. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఉన్నదంతా జూదంలో పోగొట్టుకొని ఆఖరికి తన కుటుంబాన్ని కూడా జూదంలో పోగొట్టుకున్నాడు. అసలు వివరాల్లోకి వెళితే.. పేకాట పిచ్చిలో పడిన మోసిన్ అనే వ్యక్తి భార్య బిడ్డలను ఆటలో పెట్టేశాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనం ఢిల్లీలో గత కొన్నేళ్ల క్రితం చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఢిల్లీ సెషన్స్ మేజిస్ట్రేట్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

మోసిన అనే వ్యక్తి ఇమ్రాన్ అనే మరో సన్నిహితుడితో పేకాట ఆడి మొత్తం డబ్బును ఓడిపోయాడు. అనంతరం భార్య ఇద్దరు పిల్లల్ని కూడా పేకాటలో పెట్టి ఓడిపోయాడు. దీంతో ఇమ్రాన్ మోసిన్ ఇంటికి వచ్చి పిల్లలని భార్యను తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు. కానీ మోసిన్ భార్య అందుకు ఒప్పుకోలేదు. గ్రామంలో పంచాయితీ పెద్దలను ఆశ్రయించినప్పటికీ వారు జూదంలో ఆట ప్రకారం వెళ్లాల్సిందే అని తీర్పును ఇచ్చి బాధితురాలను మరింత మనో వేదనకు గురి చేశారు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఇమ్రాన్ ఆగడాలు ఆగడం లేదు. చివరికి భర్తపై కోపంతో విడాకులు ఇవ్వగా అతను మరో వివాహం చేసుకున్నాడు. ఫైనల్ గా మోసిన భార్య సెషన్స్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలనీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం పరారీలో ఉన్న వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.