భూమిపై ప్రమాదం జరిగితే.. భూమి కిందకు వెళ్లవచ్చు!

Sunday, June 3rd, 2018, 01:55:45 AM IST

సాధారణంగా ఏవైనా విపత్తులు వస్తే భూమి మీద ఉండే ఎలాంటి ప్రాణం అయినా అంతరించిపోవాల్సిందే. క్రమక్రమంగా గత కోనేళ్ళుగా జరుగుతున్న కొన్ని ప్రకృతి విలయాలకు మనిషి మనుగడ నిలవడం లేదు. తుఫానుల రూపంలో అయినా లేక ఇంకేదైనా యుద్ధ కారణాల వల్ల అయినా ప్రాణాలు పోతున్నాయి. పైగా టెక్నాలిజీ పెరుగుతుండడం ఒక విధంగా మంచి జరుగుతున్నా అణుబాంబు వంటి ప్రమాదకరమైన కారణాలు కూడా మనిషి మనుగడను భయపెడుతున్నాయి. అయితే అది భూమి ఉపరితలపైనే జరుగుతాయి కాబట్టి భూమి కింద ఉంటే సేఫ్ అని మనిషి చేస్తున్న ప్రయత్నం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

బాంబ్‌ షెల్టర్స్‌:

వీటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్నది. సైనికులు రక్షణ కోసం భూమి కింద బంకర్లు ఉంటాయి కదా ఆ మాదిరిగా ఉంటుంది. కానీ వాటికంటే ఇవి చాలా సురక్షితమైనవి ఎలాంటి ప్రమాదాలకైనా కూడా భూమికి ఏమి కానంత వరకు బ్రతకవచ్చు. తుపాను వరదలు భయంకరమైన గాలులు వంటి ప్రమాదాలకు గ్యారెంటీ రక్షణ కవచంలా ఉంటాయి. ఒకవేళ భూమి బద్దలైతే బాంబ్‌ షెల్టర్స్‌ ఫెయిల్ అవుతాయి. అర్ధ వృత్తాకారంలో పొడవాటి గొట్టంలా దృఢమైన లోహంతో తయారు చేసిన నిర్మాణాలు ఇవి. భూమి లోపల ముందు పైపులుగా అమర్చుతారు. బయటకు వెళ్లేందుకు ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఒక కెమెరా ద్వారా కూడా తెల్సుకోవచ్చు.

తినడానికి ఆహారం ఇంకా మరిన్ని అవసరాలు బాంబ్‌ షెల్టర్స్‌ లో అందుబాటులో ఉండేలా చూసుకోవచ్చు. గాలి వచ్చేలా కూడా దీన్ని నిర్మిస్తారట. కొన్ని బడా దేశాల్లో ఇప్పటికే ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి. కొంత మంది సంపన్నులు కొనుగోలు చేసుకోవడానికి ఇష్టాన్ని చూపుతున్నారు. బాంబ్‌ షెల్టర్స్‌ ను కొన్ని ప్రత్యేకమైన సంస్థలు నిర్మించడానికి సిద్ధపడుతున్నాయి. మరి వీటి వాల్ల భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగం ఉంటుందో చూడాలి.