వీడియో : ప్రమాద నుంచి చిన్నారిని కాపాడిన స్పైడర్ మ్యాన్

Monday, May 28th, 2018, 02:17:34 PM IST

కాలం చాలా బయంకరమైనది. కళ్లు మూసి తెరిచే లోపే ఊహించని విధంగా మనిషి ప్రాణాలను తీసెయ్యగలదు. దానికి ఎదురుగా పరిగెత్తాలంటే అంత సాధ్యం కాదు. అయితే మరికొన్ని క్షణాల్లో ఓ చిన్నారి కింద పడిపోతాడు అనుకున్న సమయంలో ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం అందరిని అశ్చర్యాన్నీ కలిగిస్తోంది. ప్రమాదం అంచున వ్రేలాడుతున్న చిన్నారిని 22 ఏళ్ల యువకుడు స్పైడర్ మ్యాన్ లా వెళ్లి కాపాడేశాడు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు వివరాల్లోకి వెళితే.. పారిస్ లో ఆదివారం ఒక ప్రాంతంలో బాల్కనీ చీవరన ఒక బాలుడు వ్రేలాడుతూ కనిపించినట్లు స్థానికులు గమనించారు. అయితే మాలి కి చెందిన ఓ వ్యక్తి అక్కడే జీవనం కొనసాగిస్తున్నాడు. బాలుడు కేకలు పెడుతుంటే అందరూ అయ్యో పాపం అన్నారు తప్ప ఫాస్ట్ గా కాపాడేందుకు ప్రయత్నం చేయలేదు. మమౌడూ గస్సామా అనే 22 ఎల్లా కుర్రాడు వెంటనే చిన్నారిని కాపాడేందుకు స్పైడర్ మ్యాన్ లో బాల్కనీలను పట్టుకొని ఎక్కుతూ పిల్లాడిని కాపాడేశాడు. అతనికి సహాయంగా బాల్కనీ నుంచి మరికొంత ముందుకు వచ్చారు. అంతకుముందే పోలీసులకు సమాచారం అందించినప్పటికీ బాబును కాపాడిన తరువాత వారు వచ్చారు. విషయం తెలుసుకొని మమౌడూ గస్సామాని వారు అభినందించి వెళ్లిపోయారు.

  •  
  •  
  •  
  •  

Comments