అతడు లేకుంటే వందల ప్రాణాలు గాలిలో..!

Sunday, October 22nd, 2017, 03:30:46 PM IST

వందలాది మంది జీవితాలని ఓ వ్యక్తి కాపాడాడు. అతడు ప్రదర్శించిన వివేకం వలన హౌరా – న్యూఢిల్లీ రైలు మార్గంలో భారీ ప్రమాదం తప్పింది. ఓ మీడియా సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చింది. కానీ దీనిపై పశ్చిమ రైల్వే అధికారులు మాత్రం స్పదించకపోవడం వారి బాధ్యతలకు అద్దం పడుతుంది.

అందుతున్న వివరాల ప్రకారం హోరా – న్యూ ఢిల్లీ మార్గంలో బుర్ద్వాన్ జిల్లా వద్ద పట్టాని, మరో పట్టాతో కలపి ఉంచే షిప్ ప్లేట్ ఊడిపోయి ఉంది. ఆ పట్టాపై రైలు ప్రయాణించి ఉంటే భారీ ప్రమాదం సంభవించి ఉండేది. ఓ వ్యక్తి ఆ పట్టాని గమనించాడు. అదే సమాయంతో వందలాది మంది ప్రయాణికులతో వస్తున్న రైలుని గమనించాడు. వెంటనే తన వద్ద ఉన్న ఎరుపు వర్ణపు వస్త్రాన్ని తీసుకుని ట్రైన్ డ్రైవర్ కు సంకేతాలు పంపాడు. ప్రమాదం పొంచి ఉందని గమనించిన డ్రైవర్ వేంటనే అత్యవసర బ్రేక్ లు వేసి ట్రైన్ ని నిలిపివేశాడు. దీనితో ప్రమాదానికి కొద్ది దూరంలో రైలు ఆగిపోయింది. రైలు డ్రైవర్, మరియు ప్రయాణికులు ఆ స్థానిక వ్యక్తిని అభినందించారు. ఈ ఘటన పై రైల్వే శాఖ అధికారులు ఇంత వరకు వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.