శిశువు ముఖం పైకి సిగరెట్ పొగ వదిలాడు..జనం శభాష్ అని అభినందించారు..!

Saturday, November 12th, 2016, 12:47:19 PM IST

v
ఢిల్లీలోని ఓ బస్ స్టాప్ వద్ద ఓ యువతి తన ఒడిలో శిశువుని కూర్చొన బెట్టుకుని ఉంది. పక్కనే కూర్చున్న వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగే వ్యక్తి మరో నిర్వాకం కూడా చేసాడు. ఆ సిగరెట్ పొగని శిశువు ముఖం పైకి వదిలాడు. దీనితో అతడి దుశ్చర్యని గమనించిన అక్కడి జనం అసహనంతో అతడి పై గొడవకు దిగారు.దీనితో అతడు వారికిచ్చిన సమధానం విని జనమంతా అతడిని అభినందించారు. మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? అక్కడికే వస్తున్నా..

సాధారణంగా అయితే అతడి చర్యకు అతడిని శిక్షించాలి. కానీ జనం అతడిని అభినందించారు.దీనికి కారణం అతడిచ్చిన సమాధానమే.ఎందుకు నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు.. మనమంతా రోజూ ఢిల్లీలో విషవాయువులనే పీల్చుతున్నాం అంటూ సమాధాం ఇచ్చాడు.దీనితో అక్కడున్నవారంతా ఆలోచనలో పడ్డారు.కాలుష్యం పై అవగాహనా పెంచడానికే శిశువు బొమ్మతో ఇలా నటించామని ఆ యువకుడు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కాలుష్యం అవగాహనపై కలిగేలా ఇలా చేశామని వారు అన్నారు.ఆ యువకులు చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.