చంద్రబాబు రెడీ చేస్తున్న బ్రహ్మస్త్రం..మంచు లక్ష్మి..?

Friday, January 20th, 2017, 03:50:03 AM IST

lakshmi
ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సినీనటుడు మోహన్ బాబు రాసుకుపూసుకుని తిరుగుతున్నారు. తాను త్వరలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు.ఇటీవల సంక్రాంతి సందర్భంగా మోహన్ బాబు నారావారి పల్లె లో చంద్ర బాబు నివాసానికి వెళ్లి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలిపారు. దీనితో మోహన్ బాబు తెలుగు దేశంపార్టీ లో చేరబోతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి.మోహన్ బాబు విషయం అటుంచితే దీనిలో బాబు వేసిన మరో రాజకీయ ఎత్తుగడ కూడా ఉంది.మోహన్ బాబు కుటుంబం చిత్తూరు జిల్లా స్థానికులే. పైగా వారి కుటుంబానికి సినీ గ్లామర్ కూడా ఉంది.

ఇప్పటికే జిల్లాలో వైసిపి ఎమ్మెల్యే రోజా టిడిపి కి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తున్న రోజా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు చెక్ పెట్టడానికి టిడిపిలో సరైన మహిళా నేత కనిపించడం లేదు. బాబు ఎప్పటినుంచో రోజా ని ఎదుర్కొనే మహిళా నేత కోసం ఎదురుచూస్తున్నారు. మోహన్ బాబు టిడిపి తో చేతులు కలిపే క్రమంలో మంచు లక్ష్మి ని కూడా పార్టీ లోకి ఆహ్వానించాలని భావిస్తున్నారట.ఇటీవల మంచు లక్ష్మి కూడా చంద్రబాబు గ్లామర్ ఉన్న పొలిటికల్ లీడర్ అని కితాబిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రోజాకు పోటీగా కానీ, జిల్లాలోని ఏదేని నియోజకవర్గం నుంచి కాని మంచు లక్ష్మి ని బరిలోకి దింపాలని భావిస్తున్నారట.ఈ ప్లాన్ వర్కవుట్ అయితే రోజాకు దూకుడుకు చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు.చూద్దాం మంచు వారి ప్రభావం ఏవిధంగా ఉంటుందో ..!