పొలిటికల్ ఎంట్రీ పై మంచు మనోజ్ హింట్..?

Tuesday, November 6th, 2018, 01:17:27 PM IST

మంచు మనోజ్, మోహన్ బాబు వారసుడుగా సినిమాల్లో అడుగుపెట్టిన ఈ హీరో సంచలనాలు నమోదు చేయనప్పటికీ, టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ మధ్య సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడక స్పీడ్ తగ్గించినా, ట్విట్టర్ లో మాత్రం యాక్టీవ్ గా ఉంటున్నాడు. మొన్న జరిగిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య విషయంలో, శ్రీకాకుళం తితిలి తుఫాన్ పై ప్రజలు సమ్యవనం పాటించాలని, బాధితులకు అండగా నిలవాలని, కులాంతర వివాహాలని అందరూ అర్థం చేసుకోవాలని తనదయిన శైలిలో స్పందించారు. తాజాగా విశాఖలో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి విషయంలో ఇలాంటి వాటికీ ప్రజాస్వామ్యంలో చోటు లేదంటూ వ్యాఖ్యానించారు. ఇలా అన్ని విషయాల పై స్పందించే లక్షణం ఉన్న మనోజ్ ఇటీవల మరో సంచల నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్నట్టు ప్రకటించారు, తిరుపతి నుండి తన ప్రజాసేవ ప్రారంభించబోతున్నట్టు, అలా ప్రారంభించి రాయలసీమ మొత్తం తన సేవలు విస్తరించబోతున్నట్టు చెప్పారు. ఈ మేరకు గత నెలలో లేఖ కూడా రాసారు.

తాజాగా మనోజ్ ను ట్విట్టర్ లో తన రాజకీయ ప్రవేశం పై ఓ అభిమాని ప్రశ్నించాడు. రాజకీయ ప్రవేశం విషయంలో ” మీ ప్లాన్ ఏంటి, మీ స్కీం ఏంటి, మీ గోల్ ఏంటి?” అంటూ ప్రశ్నించాడు. దీనికి ఆయన స్పందిస్తూ, ఓ ఖాళీ ప్రదేశాన్ని చూస్తూ నిలబడ్డట్టు ఉన్న తన ఆసక్తికరమైన ఫోటో ఒకటి పోస్ట్ చేసాడు. ఆ ఫోటో కి అనుబందంగా ” పేద విద్యార్థులు, రైతుల కోసం ఎదో ఒకటి చేయాలనుకుంటున్న, ఆ కల ఈ ఖాళి ప్రదేశం ద్వారా తీరబోతుంది” అంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా ఇక్కడి నుండే తీరబోతుంది అంటూ హింట్ ఇచ్చారు. తాను ఉన్న చోట ఉచిత ఆహరం, క్రీడా సౌకర్యాలు, మంచి నీటి వసతి ఉండాలన్నదే తన లక్ష్యం అని వివరించాడు.