రాష్ట్ర రాజకీయాల్లోకి మంచు మనోజ్ ?

Monday, October 22nd, 2018, 02:04:54 PM IST

దక్షిణాదిన సినీ తారలు రాజకీయాల్లోకి ప్రవేశించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎంతో మంది సినీ నటీ నటులు రాజకీయాల్లోకి వచ్చి గొప్ప ప్రాభవాన్ని చూపారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ మధ్యే నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి సినిమాల్ని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించగా ఇప్పుడు మరొక నటుడు మంచు మనోజ్ సైతం ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నాననే స్పష్టమైన సూచన చేశారు.

మొదటి ఉంది సామాజిక స్పృహ కొంత ఎక్కువగానే ఉండే మనోజ్ గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ దేశ విదేశీ పర్యటనలు చేస్తూ అనేక జాతులు, మతాలు, కులాల ప్రజల్ని కలుస్తూ వచ్చిన ఆయన చివరకు తిరుపతి నుండి తన సేవా కార్యక్రమాల్ని ప్రారంబిస్తానని, అవి మెల్లగా ఆంధ్ర, తెలంగాణలకు కూడ విస్తరింపజేస్తానని ఒక లేఖ రాశారు.

ఆ లేఖను బట్టి సమాజ సేవకు పెద్ద వేదికైన రాజకీయాలే ఆయన ఫ్యూచర్ గోల్ అని, ఆ గోల్ చుట్టూ ఉండే లక్ష్యమే ఈ సేవా దృక్పథం అని అర్థమవుతోంది. ఈ వార్త తెలిసిన అందరూ చివరికి ఆయన తన సేవల్ని విస్తృతం చేయడానికి ఏ రాజకీయ పార్టీని వేదికగా ఎంచుకుంటారో చూడాలని ఆసక్తిగా ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments