నారా బ్రాహ్మణి పై.. మంచు మ‌నోజ్ సెన్షేష‌న్ కామెంట్స్..!

Thursday, October 25th, 2018, 11:37:03 AM IST

టీడీపీ ఎమ్మెల్యే సినీ న‌టుడు ముద్దుల కూతురు, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కోడ‌లు, మంత్రి నారాలోకేష్ భార్య అయిన నారా బ్రాహ్మ‌ణి పై టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే ఇటీవ‌ల తిత్లీ తుఫాను దెబ్బ‌కి ఉత్త‌రాంధ్రా మొత్తం అత‌లాకుత‌లం అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం జిల్లాలో తీవ్రంగా న‌ష్టం వాటిల్లిన సంగ‌తి కూడా తెలిసిందే.

అయితే శ్రీకాకుళం జిల్లాలో తుపాను బాదితుల‌ను ఆదుకోవ‌డానికి రాజ‌కీయ పార్టీలు, ప్ర‌తినిధులే కాకుండా, సినీ ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌లు కూడా ముందుకు వ‌చ్చి త‌మవంతుగా స‌హాయం చేశారు. అయితే నారా బ్రాహ్మ‌ణి మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 10 గ్రామాల‌ను ద‌త్త‌తు తీసుకుంటున్నాట్టు వార్త‌లు వెలువ‌డ్డాయి. ఈ వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డంతో సినీ న‌టుడు మంచు మ‌నోజ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. సింహం క‌డుపున సింహ‌మే పుడుతుంద‌ని.. బ్రాహ్మ‌ణి ఒక ఆడ సింహంలా క‌న‌బ‌డుతోందని.. శ‌క్తివంత‌మైన మ‌హిళ‌ల్లో ఒక‌రైన బ్రాహ్మ‌ణి ఎంద‌రికో స్ఫూర్తి క‌లిగించేలా చాలా గొప్ప‌నిర్ణ‌యం తీసుకున్నార‌ని మ‌నోజ్ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు. దీంతో ఈ మ్యాట‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments