మోదీజీ ముందు మాట్లాడటం నేర్చుకోండి : మన్మోహన్ సింగ్

Thursday, April 19th, 2018, 04:40:13 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరుచూ మాట్లాడటం నేర్చుకోవాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించారు. గతంలో తనకు ఇచ్చిన సలహానే ఇప్పుడు మోదీ పాటించాలని సూచించారు. గతంలో నేను మాట్లాడకుంటే మౌన్ మోహన్ సింగ్ అని సంబోధించారు. తరుచూ మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా మోదీ సరిగా స్పందించడం లేదు. అప్పట్లో నాకు ఇచ్చిన సలహానే ఇప్పుడు మోదీ పాటించాలని, తరుచూ మాట్లాడాలని కోరుతున్నా అని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. కతువా, ఉన్నావ్ లైంగికదాడి ఘటనలపై మోదీ సూటిగా స్పందిచకపోవడాన్ని మన్మోహన్ తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలపై వెంటనే స్పందించి, తన మద్దతుదారులకు దిశానిర్దేశం చేయాల్సి ఉంటుందన్నారు.

మోదీ మౌనంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, నేరా లు చేసినా సులభంగా తప్పించుకోగలమనే భావన పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రభుత్వాలు శాంతిభద్రతలపై పట్టు కోల్పోతున్నాయన్నారు. దళితులు, మైనారిటీలపై దాడు లు జరుగుతున్నా, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ఆయా ప్రభుత్వాలు కండ్లు మూసుకొని ఉంటున్నాయని మండిపడ్డారు. వీటి ప్రభావం 2019లో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో తీవ్రం గా ఉంటుందన్నారు. కతువా, ఉన్నావ్ ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నా కొన్నిరోజులపాటు మోదీ మౌనంగా ఉన్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments