హోదా కోసం పోరాడాల్సిందే: మ‌న్మోహన్ సింగ్

Monday, September 26th, 2016, 10:00:42 PM IST

manmohan-singh-2
ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీకి జాతీయ స్థాయి నాయ‌కులు సైతం అండ‌గా నిల‌బ‌డుతున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాల‌న్నింటికీ మ‌ద్దుతు తెలిపారు. పోరు ఆపితే హోదా రాదు. మీ వెంట నేనున్నానంటూ భ‌ర‌సా ఇచ్చారు. తాజాగా మాజీ ప్ర‌ధాన మంత్రి మ‌న్మోహన్ సింగ్ కూడా అదే ఉద్ఘాటించారు. ఏపీకి హోదా ఇవ్వ‌క‌పోతే రాష్ట్ర అభివృద్ది అసాధ్యం. అస‌లే ఇప్పుడున్న రాజ‌కీయ నాయ‌కుల్లో చిత్త‌శుద్ది లేదు. అధికారంలో ఉన్న పార్టీ హోదా ఇచ్చే వ‌ర‌కూ పోరాటం ఆప‌వ‌ద్ద‌ని సూచించారు. దీంతో జ‌గ‌న్ పోరాటానికి ఏపీలో మరింత బ‌లం చేకూరే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే వామ‌ప‌క్షాల‌తో క‌లిసి పోరాటం చేస్తాన‌ని జ‌గ‌న్ పిలుపినిచ్చారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ పెద్ద‌ల‌చే కూడా మ‌ద్దుతు ల‌భించ‌డంతో పోరు మ‌రింత ఉదృతం అవ్వ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ త్వ‌ర‌లో ప్ర‌జా బ్యాలెట్ పేరిట ఓ ఉద్యమాన్ని చేప‌ట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా ఢిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి కేవీపీ, మాజీ మంత్రి జేడీ శీలం మాజీ ప్ర‌ధానిని క‌లిసిన అనంత‌రం మ‌న్మోహ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Comments