మనోజ్ తివారీకి షాక్ – ఎమోషనల్ ట్వీట్..!

Wednesday, December 19th, 2018, 01:45:38 PM IST

ఇండియన్ బాట్స్ మెన్ మనోజ్ తివారీకి ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో చుక్కెదురైంది, గతంలో కింగ్స్ XI పంజాబ్ జట్టు తరఫున ఆడిన మనోజ్ ఈ సారి మంచి పారితోషికంతో కొత్త టీమ్ లో చోటు దక్కుతుందని ఆశించాడు, కానీ, ఏ టీం ఇతన్ని వేలంలో ఎంచుకోలేదు. దీంతో బెంగాలీ ఆటగాడు ఉద్వేగానికి లోనై “నాకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ” ట్వీట్ చేసాడు. బిడ్డర్లను ఆకర్షించడంలో ఎక్కడ లోపాలున్నాయి అన్న సందేహాన్ని వ్యక్తం చేసాడు. గత 2017సీజన్ లో కూడా రైసింగ్ పూణే జట్టు తరఫున మంచి ఆట తీరును కనపరిచినప్పటికీ ఈ సీజన్ లో చోటు దక్కకపోవడం నిజంగా ఆశ్చర్యంగానే ఉంది.

ఈ నేపథ్యం 2011లో డెబ్యూ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టుపై శతకం సాధించినప్పటికీ తనకు తర్వాతి 14మ్యాచులలో చోటు దక్కకపోవడాన్ని గుర్తు చేసుకున్నాడు మనోజ్. ఐపీయల్ సీజన్ లో మనోజ్ తివారి వెటరన్ ప్లేయర్ అని చెప్పొచ్చు, తోలి సీజన్ లో కలకత్తా జట్టు తరఫున ఆడి మంచి ఆట తీరు కనపరిచాడు ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్. 2011లో 15 మ్యాచులకు గాను 51యావరేజ్ తో 359పరుగులు సాధించాడు. 2017లో కూడా 15మ్యాచులకు గాను 32.40 సగటుతో 324 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయినప్పటికీ ఈ సీజన్ లో చోటు దక్కకపోవడం గమనార్హం.