మావోల నుండి మరో లేఖ‌.. టీడీపీ నేత‌ల‌కు చుక్క‌లు..?

Thursday, October 18th, 2018, 12:30:52 PM IST

మావోయిస్టులు మ‌రోసారి టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తూ అన్న‌లు విడుద‌ల చేసిన లేఖ టీడీపీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు.. ఒక్క హామీ కూడా స‌రిగ్గా నెర‌వేర్చ‌లేద‌ని.. అధికారంలోకి వ‌చ్చాక దోచుకోవ‌డం త‌ప్పా టీడీపీ ప్ర‌జ‌ల‌కు చేసిందేం లేద‌ని.. ఇక మ‌రోసారి మోస‌పూరిత‌మైన హామీలు ఇస్తూ టీడీపీ అధికారం లోకి రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. దీంతో ఏపీ ప్ర‌జ‌లు టీడీపీని త‌రిమి కొట్టాల‌ని.. గాలికొండ ఈస్ట్ డివిజ‌న్ ఏరియా క‌మిటీ పేరుతో తాజాగా ఓ లేఖ‌ విడుద‌ల అయ్యింది. దీంతో టీడీపీ నేత‌లు వ‌ణికి పోతున్నారని స‌మాచారం.

ఇక కొద్దిరోజుల క్రితం అధికార టీడీపీకి చెందిన అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమును డుంబ్రిగుంట మండ‌లం.. లివిటిపుట్ గ్రామం స‌మీపంలో న‌డిరోడ్డు పైన నిల‌బెట్టి మ‌రీ కాల్చి మావోలు హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత ఏజెన్సీలో ఉన్న టీడీపీ నాయ‌కులు క్ష‌ణ క్షణం ఏంజ‌రుగుతుందో అని వ‌ణికిపోతున్నారు. అయితే తాజాగా మావోల నుండి మ‌రో లేఖ రావ‌డంతో టీడీపీ నేత‌ల‌కి చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఎప్పుడు ఎవ‌రిని టార్గెట్ చేసి చంపుతారో అని టీడీపీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నారు. మ‌రి మావోల యాక్ష‌న్‌కి టీడీపీ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక కిడారి ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత తాజాగా మ‌హిళా మావోయిస్టు మీనా అలియాజ్ ప్ర‌మీల‌ను పోలీసులు హ‌తమార్చిన సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments