ఏపీలో క‌ల‌క‌లం.. ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రికి.. మావోల నుండి మొద‌టి హెచ్ఛ‌రిక లేఖ‌..!

Wednesday, October 10th, 2018, 10:34:31 AM IST

2014లో వైసీపీ త‌రుపున గెలిచి.. ఆ త‌ర్వాత టీడీపీల‌తోకి జంప్ అయిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రికి మొద‌టి హెచ్చ‌రిక‌గా మావోలు లేఖ పంపించారు. 20 కోట్ల‌కు అమ్ముడుపోయి ప్ర‌తిప‌క్ష వైసీపీ నుండి అధికార టీడీపీలోకి వెళ్ళార‌ని.. ఇకనైనా తీరు మార్చుకొని బాక్సైట్ త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా ఉధ్య‌మించాల‌ని.. లేనిచో అర‌కు ఎమ్మెల్యే స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ‌ల‌కు ప‌ట్టిన గ‌తే త‌న‌కు కూడా ప‌డుతుంద‌ని మావోయిస్టులు ఆ లేఖ ద్వారా హెచ్ఛ‌రించారు.

ఇక ఇటీవ‌ల మావోల చేతిలో అతి ధారుణంగా చంప‌బ‌డిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల‌ను హ‌త్య చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా వెళ్ళ‌డిస్తూ మావోలు మంగ‌ళ‌వారం ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు. మ‌న్యంలో ఉంటున్న గిరిజ‌నుల‌కు వారు తీర‌ని ద్రోహం చేస్తున్నార‌ని.. అక్క‌డ ఉన్న బాక్సైట్ త‌వ్వ‌కాల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఇదే విష‌యం పై గ‌తంలో అనేక సార్లు హెచ్ఛ‌రించామ‌ని.. అయితే వారిద్ద‌రు ప‌ట్టించుకోకుండా అక్క‌డ ఉంటున్న గిరిజ‌న ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేస్తున్న‌ర‌ని, అందుకే వారికి ప్ర‌జాకోర్టులో శిక్ష విధిస్తున్నామ‌ని మావోయిస్తులు ఆ లేఖ‌లో పేర్కొన్నారు. దీంతో ఇప్ప‌టికే ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ‌ల హ‌త్య‌ల‌తో ఉలిక్కిప‌డిన అక్క‌డి ప్ర‌జ‌లు.. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రికి మావోల నుండి లేఖ‌రావ‌డంతో స‌ర్వత్రా షాక్‌కు గురి అవుతున్నారు.