యూస్ ఓపెన్ టెన్నిస్ కి షరపోవా దూరం

Thursday, August 22nd, 2013, 04:51:46 PM IST

maria-sharapova

ప్రపంచ మూడో ర్యాంక్ టెన్నిస్ క్రీడాకారిణి మారియా షరపోవా యూస్ ఓపెన్ టెన్నిస్ లో పాల్గొనడం లేదని సమాచారం. ఆమె భుజానికి గల గాయం కారణంగా ఈ సారి టోర్నీ నుండి తప్పుకున్తున్నాటు తెలియజేసిందని యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ డైరెక్టర్ డేవిడ్ బ్రీవర్ తెలియజేశారు. ఈ సంవత్సరం టెన్నిస్ చివరి టోర్నీ కోసం డ్రాలు తీయాల్సివుంది. అంతకు ముందుగానే ఆమె ఈ విషయాన్ని తెలియజేసిందని ఆయన ఒక ప్రకటనలో అన్నారు. ఆమె టోర్నీ లో పాల్గొనకపోవడంతో పోలాండ్ అగ్ని యోజ్కా రాండ్వాన్ స్కా మూడో సీడ్ గా యూఎస్ ఓపెన్ లో ఆడనున్నాడని సమాచారం. భుజం గాయంతో భాదపడుతున్న షరపోవా తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని డేవిడ్ బ్రీవర్ అన్నారు.