టీ20ల్లో మరో ఫాస్టెస్ట్ సెంచరి!

Saturday, July 28th, 2018, 06:03:47 PM IST

న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్‌ ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు డకౌట్ అవుతాడో చెప్పడం కష్టం. అతను గ్రౌండ్ లో కుదురుకున్నాడు అంటే ఇక ఆపడం ఎవరివల్ల కాదు. సింగిల్స్ తీయడం మానేస్తాడు. ఏ మాత్రం గ్యాప్ ఎవ్వకుండా సగమెత్తిన పోతురాజు వలే ఆగ్రహంతో తన బ్యాటుతో శివాలెత్తుతాడు. ఇప్పటికే అతని కెరీర్ లో అనేక రికార్డును నమోదయ్యాయి. వన్డేల్లో డబుల్ సెంచరీ ఒక్కటే కాకుండా బౌండరీలు ఎక్కువ బాదిన ప్లేయర్స్ జాబితోళ్లను ఈ కివీస్ ప్లేయర్ పేరుంది.

ఇక రీసెంట్ గా ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌ టోర్నీ టీ20 బ్లాస్ట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. 35 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకం సాధించాడు. దీంతో ఓవరాల్ గా ఈ ఫార్మాట్ లో వేగంగా సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాల్లో గుప్టిల్ నాలుగవస్థానంలో నిలిచాడు. నార్తాంప్టన్‌షైర్‌ వర్సెస్ వర్సెస్టర్‌షైర్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో వర్సెస్టర్‌షైర్‌ తరపున ఆడిన గప్టిల్‌.. శుక్రవారం తనదైన శైలిలో ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. ఓవరాల్ గా ఇప్పటివరకు టీ20ల్లో ఫాస్టెస్ట్ గా సెంచరీలు చేసిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ (30 బంతుల్లో) మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత రిషబ్ పంత్ డేవిడ్ మిల్లర్ ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments