జనసేనపై జరిగింది మామూలు కుట్ర కాదంటున్న జనసేన శ్రేణులు

Monday, May 27th, 2019, 12:00:58 AM IST

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి వెళ్లాయి కానీ తెలుగుదేశం మరియు కాంగ్రెస్ ఆ తర్వాత ఆ స్థానంలో వైసీపీ ఈ రెండు పార్టీ స్థిరంగా బలమైన పార్టీలుగా నిలిచాయి.కానీ మూడో ప్రత్నామ్యాయం గా వచ్చిన ఏ పార్టీ కూడా అంతలా నిలదొక్కులేకపోయాయి.కానీ మారుతున్న కాలంతో పాటుగా సినీ రంగం నుంచి చిరు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా “జనసేన” అనే పార్టీతో ఏపీ ప్రజల ముందుకు వచ్చారు.అతను ఎక్కడ సభ పెట్టినా వేలలో జనం తరలి వచ్చేవారు.కొన్ని లోపాలు ఉన్నా సరే ఖచ్చితంగా అధికారం చేపట్టే స్థాయికి చేరకపోయిన అప్పటికప్పుడు పవన్ ప్రభావం వల్ల కింగ్ మేకర్ అయ్యే స్థాయికి పవన్ రావొచ్చు అనే సమీకరణాలు కూడా విశ్లేషకులు వెల్లడించారు.

అలాంటి పవన్ కు కేవలం ఒక్క సీట్ మాత్రమే రావడం పైగా అతనికి అపారమైన బలమున్న రెండు స్థానాల్లోనూ ఓటమి పాలవ్వడం విశ్లేషకులు సహా జనసేన వర్గాలకు కూడా అర్ధం కావడం లేని పరిస్థితి.అయితే దీని వెనుక భారీ కుట్రే ఉందని జనసేన శ్రేణులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఎన్నికల్లో జనసేన మరియు వారు పొత్తు పెట్టుకున్న సిపిఐ,సీపీఎం మరియు బీఎస్పీ పార్టీలు మూడింటికి కలిపి వచ్చిన ఓట్లు కేవలం దగ్గరదగ్గరగా 20 లక్షలు.ఇది నిజంగా పవన్ కు చాలా తక్కువ ఓటు బ్యాంకు అనే చెప్పాలి.ఎందుకంటే దీనికి పక్కా లెక్కలు కూడా ఉన్నాయి.ఆంధ్ర రాష్ట్రంలోని జనసేన పార్టీ ఒక్క నెంబర్ నుంచి సభ్యత్వం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా వారికి ఓటు హక్కు ఉండి తీరాలి.

అలా అయితేనే వారు సభ్యత్వానికి అర్హులు అదే విధంగా ఆ మధ్య మొత్తం జనసేన సభ్యత్వాలు 70 లక్షలు నమోదు అయ్యాయని పార్టీ వారే వెల్లడించారు.అయితే వీరిలో తెలంగాణ నుంచి పవన్ అభిమానులు కూడా నమోదు చేసుకున్నారు అన్నా సగంలో ఎలా లేదన్న ఏపీ నుంచి పవన్ కు 30 లక్షల ఓటు బ్యాంకు అయినా ఉంటుంది.సరే వీరికి ఆ ఓట్లు పడలేదు అనుకుందాం వీటిని పక్కన పెడితే మన ఆంధ్ర రాష్ట్రంలోనే 2014 ఎన్నికల సమయంలో ఒక్క సిపిఐ మరియు సీపీఎం పార్టీల ఓటు బ్యాంకే 6 లక్షలకు పైగా ఉంది.అలాగే బహుజన సమాజ్ పార్టీకి 4 లక్షల ఓటు బ్యాంకు ఉంది.

ఇతర పార్టీలతో చూసుకున్నట్టయితే ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకు అనేది ఖచ్చితంగా స్థిరమైనది మారనిది,సో 2019 కి వచ్చే సరికి ఈ మూడు పార్టీలకు కలిపి ఉన్న ఓటు బ్యాంకు 10 లక్షలకు పైమాటే..అంటే జనసేన పార్టీకి పవన్ వల్ల పడని ఓట్లు పక్కన పెట్టినా 10 లక్షల ఓట్లు ఈ మూడు పార్టీల చేతిలో 2014 నుంచే ఉన్నాయి.అలాంటిది 2019లో ఆ సంఖ్య కేవలం 2 లక్షలకు ఎలా పడిపోతుంది?పవన్ ఇమేజ్ తోడయ్యి అదనపు ఓటు బ్యాంకు కూడా వీరికి చేరొచ్చు.

అలాంటిది ఇప్పుడు “జనసేన”,”సిపిఐ”,”సిపిఎం” మరియు “బీఎస్పీ” మూడు పార్టీలకు కలిపి వచ్చిన ఓట్లు 20 లక్షలే అంటే ఎలా నమ్మాలి? లెఫ్ట్ పార్టీల ఓట్లు ఎలా తగ్గిపోయాయి? ఇది ఖచ్చితంగా కుట్ర కాదా పవన్ కు ఊహించిన స్థాయిలో ఓట్లు పడి సీట్లు వస్తే అతన్ని ఆపడం మిగతా పార్టీల వల్ల కాదనో మరే ఇతర కారణాలతోనో మొత్తానికి ఏదో చేసి జనసేన వామపక్షల ఓట్లు తగ్గించేశారు.ఆ ఓట్లు అన్ని ఎలా గల్లంతు అయ్యాయో లేక వైసీపీకి ఊహించని విధంగా 150 స్థానాలకు ఆ లెక్క ఎలా పెరిగిందో ఆ పైవాడికే తెలియాలని జనసేన శ్రేణులు అంటున్నారు.