ఏజెన్సీ ప్రాంత నాయకుల్లారా బీ కేర్ ఫుల్…!!

Thursday, November 3rd, 2016, 10:45:27 AM IST

mavoiest
పోలీసులు ఏవోబీ సరిహద్దుల్లో మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేసిన ఘటనకు నిరసనా మావోయిస్టు సంఘం నేతలు నేడు ఐదు రాష్ట్రాల్లో బందుకు పులుపు ఇచ్చిన విషయం అందరికీ విదితమే. అయితే ఈ బంద్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖపట్నం, విజయనగరంలో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖ, విజయనగరం నుంచి ఒడిశా, ఛత్తీస్‑గఢ్‑కు వెళ్లే బస్సులు నిలిపివేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు కూడా బస్సులను నిలిపివేశారు. అయితే వీటన్నింటికంటే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని నాయకులను అలర్ట్ గా ఉండాల్సింది గా హెచ్చరికలు జారీ చేశారు. క్రింది స్థాయి నుండి పై స్థాయి నాయకులు ఎవరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుడదని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ పరిస్థితుల దృష్ట్యా ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు పోస్టర్లు అంటించడం పట్ల ఏజెన్సీ ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.