క్రీడా స్ఫూర్తిని లెక్కచేయని మ్యాక్స్ వెల్ !

Tuesday, July 10th, 2018, 06:57:51 PM IST

ఆటలో కొన్ని సార్లు ప్లేయర్స్ మధ్య కోపాలు అలకలు సహజం. మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యే క్రికెట్ మ్యాచ్ లో అప్పుడపుడు కొంత మంది ఆటగాళ్లు మాటలతో ప్రత్యర్థి ఆటగాళ్లను కావాలని రెచ్చగొట్టడం చూస్తుంటాం. ఇక ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఇలాంటి అలవాట్లు ఎప్పటినుంచో ఉన్నాయి. పాకిస్తాన్ ఆటగాళ్ల గురించి ఇక స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఎలాంటి ప్రత్యర్థులు అయినా కూడా ఆటలో గెలుపోటముల తరువాత ఒకరికొకరు కరాచలనం చేసుకోవడం సహజమే.

అందరూ క్రీడాస్ఫూర్తిని చూపిస్తూ ఉంటారు. అయితే ఆసీస్ ఆటగాడు మ్యాక్స్ వెల్ ఆ క్రీడాస్ఫూర్తిని మరచి అతిగా ప్రవర్తించాడు అని కామెంట్స్ వస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ ఆసీస్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాక్ 6 వికెట్లతో విజయాన్ని అందుకుంది. అయితే ఆట అనంతరం ఆటగాళ్లందరూ ఒకరికరు అభివాదాన్ని తెలుపుకుంటూ కరాచలనం చేసుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ షేక్ హ్యాండ్ ఇస్తుండగా మ్యాక్స్ వెల్ అతన్ని చూడలేదు. దీంతో సర్ఫరాజ్ మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఇక ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాక్స్ వెల్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అనంతరం ఈ విషయంపై మ్యాక్స్ వివరణ ఇచ్చాడు. తాను కావాలని చేయలేదు అని ఎదో ఆ సమయంలో అలా జరిగిందని చెప్పినప్పటికీ మ్యాక్స్ పై పాక్ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments