ఉగ్రరూపం దాల్చిన మాయావతి – బీజేపీ పై మండిపాటు

Tuesday, February 12th, 2019, 04:13:36 PM IST

బహుజన సమాజ్ వాద్ పార్టీ అభినేత్రి మాయావతి బీజేపీ పైన తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నాయకులు చేస్తున్న మోసపూరితమైన చర్యలను ఒక్కొక్కటిగా ఎండగడుతూ… కేంద్ర సర్కారును, మరియు పని తనాన్ని తప్పుబట్టారు మాయావతి. అనవసరంగా మమ్మల్ని చూసి బిజెపి నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు… ‘ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ-ఎస్పీ కూటమిని చూసి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర సర్కారు భయపడుతోంది. అందుకే, మా కూటమి రాజకీయ కార్యక్రమాలను అడ్డుకుంటోంది. బీజేపీ చేస్తున్న విషమ నియంతృత్వ పాలనకు ఇదే ఉదాహరణ అని అన్నారు. అంతేకాకుండా అఖిలేష్ యాదవ్ పై జరిగిన ఘటనను కూడా ఖండించారు. ఇదే సంఘటన పై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‘ఇటువంటి అరాచక కార్యక్రమాలను సమాజ్‌ వాదీ పార్టీ ఆపేయాలి అంటూ తీవ్రంగా విమర్శించారు.