మీ టూ ఎఫెక్ట్ : సల్మాన్ పై ఐష్ సంచలన వ్యాఖ్యలు.!

Thursday, October 11th, 2018, 11:45:39 AM IST

ఈ మధ్య కాలంలో కాస్టింగ్ కౌచ్ పేరిట సినీ మహిళా నటులు తమని వేధింపులకు గురి చేస్తున్నారన్న వార్తలు సంచలనానికి తెరలేపాయి.దీనితో ధైర్యం చేసి చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయట పెడుతూ బయటకి వచ్చారు.ఇది ఇక్కడే కాదు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఉంది.అయితే హాలీవుడ్ లో తాము తమ కో స్టార్స్ యొక్క వేధింపులకు గురయ్యామని కొంత మంది నటీమణులు “మీ టూ” అనే ఒక నినాదం పేరిట బయటకి వచ్చారు.ఇప్పుడు ఈ మీ టూ ఎఫెక్ట్ భారతదేశాన్ని కూడా తాకింది.

భారత క్రీడాకారులు మరియు బాలీవుడ్ నటీమణులు కూడా చాలా మంది తాము వేధింపులకు గురైన వాళ్ళమే అని చెప్పుకుంటూ సంచలనాన్ని సృష్టిస్తున్నారు.ఇప్పుడు తాజాగా అందాల నటి మిస్ వరల్డ్ “ఐశ్వర్య రాయ్” తాను కూడా దారుణమైన వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చారు.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనని లైంగికంగా వేధించి గాయపరిచాడని చెప్పుకొచ్చారు.తాను చేసినటువంటి గాయాలు బయటకి కనపడకపోవడం తన అదృష్టమని తెలిపారు.

ఈ జాబితాలోకి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా కూడా తన గొంతు విప్పారు.తాను కూడా ఈ “మీ టూ” ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నాని గతంలో తన వృత్తిలో కూడా తోటి ఆటగాళ్ల యొక్క వేధింపులకు గురయ్యాను అని తెలిపారు.తాను టెన్నిస్ నుంచి తప్పుకోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని తెలిపారు.ఇది వరకు గుత్తా జ్వాలా నితిన్ యొక్క “గుండె జారి గల్లంతయ్యిందే” చిత్రంలో ఒక పాటలో కూడా తళుక్కుమన్నారు.