33 బీర్లు కానుకగా ఇచ్చారు!

Tuesday, September 11th, 2018, 05:25:50 PM IST

ఇంగ్లాండ్ సీనియర్ క్రికెటర్ అలెస్టర్‌ కుక్‌ ఇండియాతో ఆఖరి టెస్ట్ అనంతరం రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ బ్రిటిష్ బ్యాట్స్ మెన్ కు క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు అందించారు. కూక్ సేవలు మరువలేనివని ఆ దేశ సీనియర్ ఆటగాళ్లు అతనికి సంబందించిన పలు మధుర క్షణాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇకపోతే అక్కడ నిత్యం జట్టుకు వెన్నంటి ఉండే ఇంగ్లీష్ మీడియా కూడా కూక్ పై ప్రశంసల జల్లును కురిపిస్తోంది.

అతను రిటైర్మెంట్‌ ప్రకటించిన సందర్బంగా మీడియా సభ్యులు ఎవరు ఊహించని కానుకలను ఇచ్చారు. గతంలో కూక్ ‘నేను వైన్‌ డ్రింకర్‌ను కాదు బీర్‌ మ్యాన్‌’ అని చెప్పిన మాటను గుర్తు పెట్టుకొని 33 శతకాలు సాధించిన ఈ బ్యాట్స్ మెన్ కు 33 బీర్లను కానుకగా ఇచ్చారు. ప్రతి బీర్ బాటిల్ పై ఒక సందేశం రాసి మరి ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో కు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాలుగో రోజు ఆటలో కూడా కుక్‌ చివరగా శతకం సాధించిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments