పవన్ ఆ ఛానెల్ ని సొంతం చేసుకున్నాడా?

Friday, July 13th, 2018, 12:20:16 AM IST

ప్రజలలో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి నాయుకుడికి ఉంటుంది. అలాగే పార్టీని స్థాపించిన తరువాత జనాల్లో కూడా నమ్మకం కలిగేలా చేసుకోవాలి. ఏ మంచి పని చేసినా కూడా నలుగురికి తెలియాలి. అలాగే అందరిని సమానంగా చూసుకుంటూ వెళ్ళాలి. పార్టీ అధ్యక్షుడిగా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇక ప్రస్తుత రోజుల్లో రాజకీయ పార్టీలకు తప్పకుండా మీడియా మద్దతు ఉండాల్సిందే.

ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో చాలా వరకు అందరూ మీడియా మద్దతును అందుకుంటున్నారు. ఇక మరికొందరైతే సొంతంగా ఛానెల్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన కు ఇప్పుడు కొన్ని ఛానెల్స్ పూర్తి వ్యక్తిరేకతతో ఉన్నాయి. గతంలో పవన్ పలు ఛానెల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కి సొంతంగా ఇప్పుడు ఒక ఛానెల్ ఏర్పడినట్లు తెలుస్తోంది. 99 అనే ఛానెల్ ని జనసేన కు చెందిన కీలక నేత మాజీ ఐపీఎస్ అధికారి ఒకరు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ సోషల్ మీడియాలో శతగ్ని టీమ్స్ ను బలంగా చేశాడు. పవన్ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడిపుడే క్రేజ్ అందుకుంటున్న ఛానల్ కూడా పవన్ కు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉండడంతో జనసేన పార్టీ కొంత బలంగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments