అప్పుడు తెలంగాణ – ఇప్పుడు పవన్ యాత్ర.. మీడియా మళ్లీ అదే తప్పు చేస్తోందా?

Saturday, July 14th, 2018, 01:35:33 PM IST

మీడియా అంటే సమాజంలో ధైర్యంగల ఒక శక్తి అని ఇంతకుముందు అంతా భావించేవారు. ప్రజలకు అండగా ఉంటుంది. మంచి కోసం ఎప్పుడు ముందుంటుందని అనుకోవడం సహజమే. అయితే ఇప్పట్లో కొన్ని మీడియా ఛానెల్స్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. పార్టీకో మీడియా అండ అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. పార్టీకి మద్దతు ఇస్తూ రాజకీయాలు నడిపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్ని ఛానెల్స్ సమైక్యాంద్ర కు మద్దతు ప్రకటించాయి.

అందులో ఎలాంటి పొరపాటు లేదు గాని తెలంగాణ ఉద్యమాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. డైరెక్ట్ గా టీవీ ఛానెల్స్ లో తెలంగాణ ఉద్యమ తీరుపై నెగిటివ్ పబ్లిసిటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజలకు ఉద్యమ ప్రభావం ఏ మాత్రం తాకవద్దని ప్రచారాలు చేయడం నిలిపివేశారు. ఇక అప్పటి నేతలు మరింత తెలివిగా అలోచించి పలు తెలంగాణ జిల్లాల్లో ఉద్యమ సభల గురించి తెలియకుండా కరెంట్ కూడా తీయించారు. అన్ని గుర్తుంచుకొని అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చెప్పేవారికి కరెక్ట్ గా సమాధానం చెప్పారు.

ఇక ఆ సంగతి పక్కనపెడితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ పై ఇంతకుముందు కొన్ని ప్రముఖ చేనెల్స్ స్పెషల్ గా టార్గెట్ చేసి దెబ్బకొట్టాయి. పవన్ కూడా అంతే స్థాయిలో కేవలం ట్విట్టర్ ద్వారానే కౌంటర్ ఇచ్చాడు. అప్పటి నుంచి వివాదస్పద డిబేట్స్ పెట్టడం మానేశారు. ఓ ఛానెల్ అయితే పవన్ పేరు కూడా మళ్లీ ఎత్తలేదు. ఇక మరో ఛానెల్ పవన్ పై నెగిటివ్ ప్రచారాలను ఎక్కువగా చేసి విమర్శలు మూటగట్టుకుంది.

ఇక ఇప్పుడు ఓ నాలుగు చానెళ్లు కుమ్మక్కై పవన్ చేస్తున్న పోరాటాలను సభలను గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మొన్న జనసేన భారీ స్థాయిలో కవాతు నిర్వహించినప్పటికీ పెద్ద చేనెల్స్ కెమెరా అటు తిప్పకపోవడం గమనార్హం. చిన్న మీటింగ్ జరిగినా ఇతర పార్టీల కు సంబందించిన వార్తలను స్పెషల్ ఎపిసోడ్ తో టెలిక్యాస్ట్ చేసే ఆ మీడియా వారు పవన్ చేసిన యాత్రలపై సభలపై చిన్న వార్త ప్రజలకు అందించకపోవడం గమనార్హం.

ఓ మహిళ చెడుగా తిట్టినప్పుడు అదే పనిగా చూపించి పవన్ పై కామెంట్స్ చేస్తే డిబేట్స్ పెట్టిన ఛానెల్స్ సడన్ గా పవన్ ను పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ఛానెల్స్ ఎంత పొరపాటు చేశాయో ప్రజలకు అర్థమైంది. ఇక ఇప్పుడు పవన్ పై కూడా అదే తరహాలో ప్రవర్తించడం కూడా జనాలకు అర్థమవుతోందనే టాక్ వస్తోంది.

అయినా పవన్ లోకల్ గా జనాలను ఆకర్షిస్తున్నాడు. ఎక్కడైనా సభాలను నిర్వహిస్తే అక్కడ తన పార్టీ పేరు మారుమ్రోగేలా మీటింగ్ లు పెడుతున్నాడు. అది రాష్ట్రమంతా తెలియాల్సిన అవసరం లేదు. పైగా పవన్ సోషల్ మీడియాలో పార్టీ పేరుకు బలాన్ని తెస్తున్నారు. ఇప్పటికే శతగ్ని టీమ్ మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ పై ఎన్ని నెగిటివ్ వార్తలు ప్రచారం చేసినా కూడా ప్రస్తుతం ప్రజలు మీడియా పై నమ్మకంతో లేరు అనేది వాస్తవం. రాజకీయ పరిణామాలను చుస్తే ఎవరు ఎలాంటి నాయకులో అర్ధం చేసుకునే పరిస్థితికి జనాలు వచ్చారని కొన్ని మీడియా ఛానెల్స్ అర్ధం చేసుకుంటే మంచిది.

  •  
  •  
  •  
  •  

Comments