బీజేపీ మెడకు చుట్టుకున్న ‘మీ టూ’ ఉద్యమం !

Friday, October 12th, 2018, 10:25:57 AM IST

సినిమా రంగంలో లైంగిక వేధింపులకు నిరసనగా నటీమణులు చేపట్టిన ‘మీ టూ’ మూమెంట్ మెల్లగా మీడియా రంగంలోకి విస్తరించి ఇప్పుడు అధికార బీజేపీ మెడకు చుట్టుకుంది. కేంద్ర సహాయ మంత్రి ఎంజే అక్బర్ తమను వేధింపులకు గురిచేశాడని పలువురు జర్నలిస్టులు ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై అధిష్టానం సైతం సీరియస్ గా ఉంది. ఇదే అదునుగా భావించితిన్ కాంగ్రెస్ పార్టీ అక్బర్ వెంటనే పదివికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

రెండు దశాబ్దాల క్రితం టెలిగ్రాఫ్, ఏషియన్ ఏజ్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసేటప్పుడు అక్బర్ తమను తీవ్ర వేధింపులకు గురిచేశాడని, శారీరకంగా, మానసికంగా వేధించాడని సుమారు 10 మంది మహిళా జర్నలిస్టులు సోషల్ మీడియాలో వివరాలతో సహా చెప్పుకొచ్చారు. దీంతో బీజేపీ అనుబంధ ఆర్ఎస్ఎస్ పార్టీ ప్రతిష్ట దెబ్బ తినకుండా ఉండాలంటే అక్బర్ రాజీనామా చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నారట. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంలో ఈ ఉడటం వెలుగులోకి రావడం మోడీని సైతం కలవరపెడుతోంది.

ఈ ఉదంతంతో బీజేపీ చేపట్టిన భేటీ బచావో భేటీ పడావో, పలు స్త్రీ సాధికారత పథకాలు అపహాస్యానికి గురవుతున్నాయి. ప్రస్తుతం నైజీరియా పర్యటనలో ఉన్న అక్బర్ ఆదివారం తిరిగొచ్చాక వివరణ ఇచ్చే అవకాశాలున్నాయి. ఆరోపణలు నిజమని తేలితే ఆయన్ను పార్టీ నుండి తొలగించడం మినహా బీజేపీకి మరో ప్రత్యాన్మాయం కనిపించడంలేదు.