మీ..టూ సెన్షేష‌న్.. ఆ హీరోయిన్ పై అర్జున్ 5కోట్ల దావా..!

Friday, October 26th, 2018, 10:54:00 AM IST

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న మీ..టూ ఉధ్య‌మంలో భాగంగా ప్ర‌ముఖ న‌టి శృతి హ‌రిహ‌ర‌న్ తాజాగా సీనియ‌ర్ హీరో అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో శృతి ఆరోప‌ణ‌లు ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని.. త‌న సినీ కెరీర్ మొత్తంలో చాలామంది హీరోయిన్ల‌తో ప‌ని చేశాన‌ని.. ఎవ‌రితోనూ త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని.. శృతి వ్యాఖ్య‌లు త‌న ప‌రువు, ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగే విధంగా ఉన్నాయ‌ని.. దీంతో ఈ వ్య‌వ‌హారం న్యాయ‌స్థానంలోనే తేల్చుకుంటాన‌ని అర్జున్ స్పందించిన సంగ‌తి తెలిసిందే.

ఇక అర్జున్ పై శృతి ఆరోప‌ణ‌లు చేసిన అనంత‌రం ప‌లువురు సీనియ‌ర్ హీరోయిన్లు అర్జున్ చాలా మంచి వ్య‌క్తి అని అత‌నో జెంటిల్‌మెన్ అని మ‌ద్ద‌తు ప‌ల్కిన సంగ‌తి తెలిసిందే. అయితే న‌టుడు ప్ర‌కాష్ రాజ్ మాత్రం శృతి హ‌ర‌హ‌ర‌న్‌కు స‌పోర్టుగా నిలిచారు. అయితే ప‌బ్లిసిటీ కోసం శృతి చేసిన త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌కు త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని అర్జున్ అభిమానులు మండిప‌డుతున్నారు. అయితే ఈ క్ర‌మంలో తాజాగా అర్జున్ మేన‌ల్లుడు ప్ర‌ముఖ హీరో ధృవ.. శృతి హ‌రిహ‌ర‌న్ పై 5కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేశాడు. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎంత దూరం వెళుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments