మీ..టూ సెన్షేష‌న్.. వారిని వెంట‌నే చిత్ర‌ప‌రిశ్ర‌మ నుండి బ‌హిష్క‌రించాలి..!

Wednesday, October 24th, 2018, 07:00:15 PM IST

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌ల‌కు ఎదుర‌వుతున్న లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా ఈ మీ..టూ ఉధ్య‌మం తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్ప‌టికే మీ..టూ సినీ ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా అన్ని రంగాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేప‌తున్న మీ..టూ ఉధ్యమాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్ళేందుకు భార‌తీయ‌ మ‌హిళా ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, మ‌రికొంత మంది మ‌హిళా టెక్నీషియ‌న్స్ సంచ‌ల‌న నిర్ణయాలు తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నార‌నే వార్త బాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఇక అసలు మ్యాట‌ర్ లోకి వెళితే.. మీ..టూ ఉధ్య‌మానికి త‌మ‌వంతుగా కృష చేయ‌డానికి.. నందితా దాస్, నిత్యా మెహ్రా, రీమా క‌గ్టీ, రుచి న‌రైన్, సోనాలీ బోస్, జోయా అక్త‌ర్, అలంక్రితా శ్రీవాస్త‌వ‌, గౌరీ షిండే, కిర‌ణ్ రావ్, కొంక‌ణా సేన్ శ‌ర్మ‌, మేఘనా గుజ‌ర్‌లు తాజాగా స‌మావేశం అయ్యి కొన్నికీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని స‌మాచారం. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌ల్ని లైంగికంగా వేధించేవారిని ఇండ‌స్ట్రీ నుండి పూర్తిగా బ‌హిష్క‌రించాల‌ని.. అంతే కాకుండా అన్ని క్రాఫ్టుల్లో అమ్మాయిల‌కు కూడా స‌మాన హ‌క్కును క‌ల్పించాల‌ని.. వీరంతా నిర్ణ‌యం తీసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాష‌ల చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో వీళ్ళ డిమాండ్స్ ఎంత‌వ‌ర‌కు ఆమోద‌యోగ్యం అవుతాయో చూడాల‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments