మెగా ఫ్యాన్స్ ఆన్ ఫైర్: ఇది ముమ్మాటికీ బోయపాటి కుట్రే..!

Saturday, January 12th, 2019, 01:00:20 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన వినయ విధేయ రామ నిన్న విడుదలై పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకు మొదటి షో నుండే విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లకు ఇదొక కామెడీ పీస్ గా మారింది. బోయపాటిలోని మాస్ యాంగిల్ వెర్రి తలలు వేసినట్లున్న కొన్ని సీన్స్ ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు వచ్చినంత నెగిటివ్ టాక్ ఏ సినిమాకు రాలేదంటే అతిశయోక్తి కాదు, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ లో అద్భుత నటన కనపర్చిన రామ్ చరణ్ ను బోయపాటి సరిగ్గా వాడుకోలేక పోయాడని విమర్శలు వస్తున్నాయి. ఇక బోయపాటి పని అయిపోయిందని కూడా అంటున్నారు శ్రీను వైట్ల, వీవీ వినాయక్, లాంటి ఫేడ్ అవుట్ అయిన దర్శకుల లిస్ట్ లో బోయపాటిని కూడా చేర్చ్చని అంటున్నారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాట పక్కన పెడితే, బోయపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం మాములుగా లేదు. కొంతమంది మెగా ఫాన్స్ అయితే ఒక అడుగు ముందుకేసి ఇది బోయపాటి కావాలని చేసిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. గతంలో రామ్ చరణ్ టాలీవుడ్ లో మురుగదాస్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఒకరు కూడా లేరని చేసిన కామెంట్స్ రేపిన దుమారం గురించి తెలిసిందే కదా, అయితే రామ్ చరణ్ అప్పట్లో మురుగదాస్ ను పొగిడే ఉద్దేశం అలా అన్నాడు. దీనికి బాలకృష్ణ అప్పట్లో రామ్ చరణ్ పేరు ఎత్తకుండా “వాళ్లకేం తెలుసు తెలుగు సినిమా చరిత్ర, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాల్తాయ్,” అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత రామ్ చరణ్ వివరణ ఇవ్వటంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది. ఆ వివాదం మనసులో పెట్టుకున్న బోయపాటి ఇలాంటి దారుణమైన డిజాస్టర్ ఇచ్చాడని అంటున్నారు. మరి కొంతమందైతే, బోయపాటిది బాలయ్య సామజిక వర్గమీ కాబట్టి, ఎన్టీఆర్ కధానాయకుడు కి పోటీగా వస్తున్నా ఈ సినిమాను కావాలనే డిజాస్టర్ చేసాడని అంటున్నారు. ఇక్కడ మెగా ఫాన్స్ ఒక విషయం మరిచినట్లు అనిపిస్తుంది, గతంలో బోయపాటి డ్రెక్షన్ లో బన్నీ హీరోగా వచ్చిన సరైనోడు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది, వాళ్లు అంటున్నట్లు బోయపాటికి కుట్రే అయితే అప్పట్లో బన్నీకి అంత పెద్ద హిట్ ఇచ్చేవాడు కాదు, ఈ విషయాన్నీ అలోచించి మెగాఫ్యాన్స్ బోయపాటిని ఆరోపించడం ఆపేస్తే మంచిది.