చిరంజీవిగారు తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మామూలు షాక్ ఇవ్వలేదుగా !

Sunday, September 18th, 2016, 07:30:09 PM IST

chiru
సినీ రంగంలో అన్నదమ్ముల అనుబంధం అంటే ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి – పవన్ కళ్యాణ్ లే. కొన్నేళ్ల క్రితం వరకూ అన్న చుట్టూ కంచు కోటలా ఉంటూ అన్న మీద చిన్న మాట కూడా పడనిచ్చేవాడు కాదు పవన్. ఎవరైనా సరే అన్నకు కౌంటర్ ఇస్తే వాళ్లకు కోలుకోలేని ఎన్ కౌంటర్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కారణాలు ఏవైనా ఇద్దరూ ఎవరికి వారు అన్నట్టు ఉన్నారు. చిరంజీవి అయితే ఇద్దరికీ సంబందించిన కొన్ని విషయాల్ని గతం మర్చిపోయి వన్ వేలో మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకొచ్చిందంటే నిన్న రాత్రి వైజాగ్ లో జరిగిన మోహన్ బాబు 40 వేడుకలో చిరు ప్రసంగంచేసియాన్ ప్రసంగం మూలంగా వచ్చింది.

స్టేజిపై ఆయన మాట్లాడుతూ మోహన్ బాబుది రాక్షస ప్రేమ. విపరీతమైన అభిమానం, వాత్సల్యం చూపుతాడు. సరదాగా మేము వేసుకునే చలోక్తుల్ని బయట పెద్ద రచ్చ చేస్తున్నారు. ఎందుకో అర్థం కావడం లేదు. మేమెప్పటికీ మంచి స్నేహితులం’ అంటూ సభా పెద్దగా బాగానే మాట్లాడారు. కానీ గతంలో వీరీ మధ్య నడిచిన మాటల వివాదంలో మోహన్ బాబు చిరుకు కౌంటర్ వేశారు. దానికి చిరంజీవి ఏం మాట్లాడలేదు. కానీ అన్న మీద మాట పడే సరికి పవన్ ఆవేశంగా ‘తమ్ముడూ మోహన్ బాబు..’ అంటూ పెద్ద ఎన్ కౌంటర్ వేశాడు. దాంతో మెగా అభిమానవులంతా అద్ది తమ్ముడు పవన్ అంటే.. అన్న మీద మాట పడితే ఊరుకుంటాడా ఏంటి.. అంటూ సంబరపడ్డారు. కానీ నిన్న మాత్రం చిరంజీవి అన్నీ మర్చిపోయి అలా మాట్లాడే సరికి అభిమానులంతా అంటే గతమంతా గాల్లో దీపమేనా.. ఇది మామూలు షాక్ కాదు బాబోయ్.. అనుకుంటున్నారు.