మెగాస్టార్ గ్రేట్‌ ఎస్కేప్ ప్లాన్‌?

Saturday, September 15th, 2018, 12:11:51 PM IST

ముంద‌స్తు ఎన్నిక‌ల వార్ షురూ అయిన వేళ మెగాస్టార్ చిరంజీవి ప్లాన్స్ ఏంటి? ఆయ‌న తిరిగి రాజ‌కీయాల్లోకొస్తున్నారా లేదా? కాంగ్రెస్‌కి బాస‌ట‌గా నిలుస్తారా లేదు పొమ్మంటారా? ప‌్ర‌స్తుతం ఎన్నో ప్ర‌శ్న‌లు. సైరా బిజీలో మెగాస్టార్ చిరంజీవి ఇక రాజ‌కీయాల‌కు కామా పెట్టేసి, పూర్తిగా ఎస్కేప్ అయ్యే ప్లాన్‌లో ఉన్నారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అస‌లు వాస్త‌వ స‌న్నివేశం విశ్లేషిస్తే.. మెగాస్టార్ ప్ర‌స్తుతం సైరా-న‌ర‌సింహారెడ్డి చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌న‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య లాంటిది. ఎట్టి ప‌రిస్థితిలో టాలీవుడ్‌లో త‌న అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకోవాలంటే ఈ చిత్రంతో మ‌రోసారి స‌త్తా చాటుకోవాల్సిన స‌న్నివేశం ఉంది. పైగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి ఏకంగా 200కోట్ల బ‌డ్జెట్‌ని ఈ సినిమా కోసం వెచ్చించి ఛాలెంజింగ్‌గా నిర్మిస్తున్నారు. ఓ ర‌కంగా ఇదో అసాధార‌ణ‌మైన ఛాలెంజ్ త‌న‌కు. అందుకే మెగాస్టార్ దృష్టి అంతా పూర్తిగా సైరా షూటింగ్ పైనే. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌చ‌రిత్ర కాబ‌ట్టి, ఈ పాత్ర‌కు తాను త‌ప్ప వేరొక‌రు స‌రిపోరని నిరూపించేంత గొప్ప‌గా అభిన‌యించాల‌న్న పంతంతో మెగాస్టార్ ఉన్నారు. అందుకే ఓవైపు రాజ‌కీయాలు వేడెక్కుతున్నా తాను మాత్రం స్పందించ‌డం లేదు. తాజా స‌న్నివేశం చూస్తుంటే అత‌డు పూర్తిగా ఎస్కేప్ ప్లాన్‌లోనే ఉన్నార‌న్న మాటా వినిపిస్తోంది.

తెలంగాణ‌లో కేసీఆర్‌ని ఒంట‌రిని చేసి ప్ర‌త్య‌ర్థులంతా ఏక‌మ‌య్యారు. కాంగ్రెస్ ఎట్టి ప‌రిస్థితిలో ఈ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌ను ఛేజిక్కించుకోవాల‌న్న పంతంతో ముందుకు సాగుతోంది. అందుకే నేరుగా ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీనే బ‌రిలో దిగి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌ల తెలంగాణ‌లో రెండ్రోజుల ప‌ర్య‌ట‌న‌తో హీట్ పెంచారు. ఇక కాంగ్రెస్‌-తేదేపా, క‌మ్యూనిస్టుల‌ అల‌యెన్స్‌కి టీజేఎస్‌ని క‌లుపుకుని ముందుకు సాగుతున్నారు. ప‌నిలో ప‌నిగా చిరంజీవిని తెస్తే త‌మ‌కు అది సినీగ్లామ‌ర్ ప‌రంగా అస్సెట్ అవుతుంద‌ని భావిస్తున్నారు. యువ‌రాజా రాహుల్ స్వ‌యంగా చిరుకి ఫోన్ చేసి మాట్లాడ‌తార‌న్న ముచ్చ‌టా సాగుతోంది. ఒక‌వేళ రాహుల్‌నే స్వ‌యంగా చిరుతో మాట్లాడితే ఆ వ్యూహం ఫలించే ఛాన్సుంది. అయితే అది సైరాకి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామ‌మే అవుతుంద‌న్న ఆలోచ‌న మెగా కాంపౌండ్‌లో ఉంది. సైరా చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితిలో ఈ స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని పూర్తి చేస్తున్న వేళ చిరు రాజ‌కీయాల్లోకి వెళితే ఆ మేర‌కు పంచ్ ప‌డిపోతుంద‌న్న ఆందోళ‌న కొణిదెల కాంపౌండ్‌లో ఉంద‌ని చెబుతున్నారు. చూద్దాం.. ఏం జ‌ర‌గ‌బోతోందో?

  •  
  •  
  •  
  •  

Comments