మెగాస్టార్ -కొరటాల సినిమాకు నిర్మాత చరణ్ ?

Thursday, June 14th, 2018, 10:03:51 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. 200 తో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత ,మెగాస్టార్ క్రేజీ దర్శకుడు కొరటాల శివతో చేయడానికి సిద్ధం అయ్యాడు. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని తెలిసింది. అయితే ఈ సినిమాను కూడా రామ్ చరణ్ నిర్మిస్తాడట. నిజానికి ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ నిర్మిస్తున్నారని వార్తలు వచ్చాయి .. కానీ ఫైనల్ గా రామ్ చరణ్ నిర్మిస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేస్తాడని, అందులో ఓ పాత్రలో రైతుగా కనిపిస్తే మరో పాత్రలో బిలియనీర్ గా ఉంటాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జోరుగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాను పట్టాలు ఎక్కించే పనిలో పడ్డారు. ఇక హీరోయిన్స్ ఎవరు అన్నది త్వరలోనే వెల్లడి కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments