మెగాస్టార్ రెమ్యున‌రేష‌న్‌ ఎగ్గొట్టిన నిర్మాత‌?

Tuesday, September 18th, 2018, 01:43:07 PM IST

మెగాస్టార్ చిరంజీవితో రెండు సినిమాలు తీశారు ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌. కోత‌లరాయుడు, మొగుడు కావాలి. ఆరోజుల్లో చిరంజీవి కెరీర్ కోసం పాకులాడే స‌న్నివేశం. అందుకే ఆ టైమ్‌లో హీరోగా అవ‌కాశం ద‌క్క‌డ‌మే గొప్ప‌. అలాంటి టైమ్‌లో త‌మ్మారెడ్డి రెండు సినిమాల్లో చిరుకి అవ‌కాశం ఇచ్చారు. అంతేకాదు.. ఆ సినిమాల‌కు తాను క‌నీసం రెమ్యున‌రేష‌న్ కూడా ఇవ్వ‌లేద‌ని త‌మ్మారెడ్డి స్వ‌యంగా గుర్తు చేశారు. నేడు ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన త‌మ్మారెడ్డి చిరు గురించి కొన్ని షాకిచ్చే నిజాలే చెప్పారు.

మెగాస్టార్‌తో 40 ఏళ్ల క్రితం `మొగుడు కావాలి`, కోత‌ల‌రాయుడు సినిమాలు తీశాన‌ని, త‌మ మ‌ధ్య ఎంతో గొప్ప అనుబంధం ఉంద‌ని త‌మ్మారెడ్డి తెలిపారు. ఆయ‌న‌తో రెండు సినిమాలు చేసినా, అస‌లు డ‌బ్బులే ఇవ్వ‌లేద‌ని చెప్పి షాకిచ్చారు. త‌ర్వాత చాలా కాలం సినిమాల ప‌రంగా మేం క‌లుసుకోలేదు. ఆ త‌ర్వాత నేను ద‌ర్శ‌కుడిని అవుతూ `అల‌జ‌డి` సినిమా చేస్తే నేను పిల‌వ‌కుండానే ఆయ‌న వ‌చ్చి పార్టీ ఇచ్చార‌ని తానంటే చిరుకి అంత అభిమానం అని చెప్పారు. నాటి చిరు వేరు.. నేటి చిరు వేరు. అయినా ఇప్ప‌టికీ నేనంటే అభిమానంతో ప్ర‌మోష‌న్‌కి వ‌స్తారు… అని అన్నారు. యువ‌న్ శంక‌ర్ రాజా నిర్మించిన `ప్యార్ ప్రేమ కాద‌ల్` చిత్రాన్ని త‌మ్మారెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ని చిరు రిలీజ్ చేసి ఆశీర్వ‌దించారు. ఇక‌పోతే చిరు గురించి మ‌రో సీక్రెట్‌ని త‌మ్మారెడ్డి చెప్పారు. “చిరంజీవికి సినిమా అంటే చాలా పిచ్చి. నా సినిమా కోత‌ల‌రాయుడు కి డ్యాన్స్ మాష్ట‌ర్లు, ఫైట్ మాష్ట‌ర్లు లేరు. ఆయ‌నే ఫైట్ మాస్ట‌ర్. మొగుడు కావాలి టైమ్‌లో 47రోజులు ప్యారిస్ వెళ్లాలి. నైట్ షూట్ పూర్తి చేసి, వెళ్లాలి. రాత్రి షూటింగ్ … మోకాళ్ల‌కు నీ క్యాప్ కావాలి… ఆ స‌న్నివేశాలు అలాంటివి. అందుకే ఆ రాత్రి షూట్ పూర్తి చేసి, స్పిరిట్ చూపించారు. నా కాలు పోయినా ఫ‌ర్వాలేదు సినిమా పూర్తి చేయాలి. 40 ఏళ్ల నుంచి ఆయన మెగాస్టార్‌గా ఉన్నారంటే కార‌ణ‌మిదే“న‌ని త‌మ్మారెడ్డి తెలిపారు.