‘మా’ వివాదంతో మెగాస్టార్ హ‌ర్ట్ అయ్యారా?

Wednesday, September 5th, 2018, 02:18:51 PM IST

`మా` వివాదంపై అధ్య‌క్షుడు శివాజీరాజా, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌రేష్ మీడియాకెక్కి ర‌చ్చ చేసిన‌ సంగతి తెలిసిందే. ఆరోప‌ణలు..ప్ర‌త్యారోప‌ణ‌ల‌ న‌డుమ వివాదం మ‌రింత ముదురుతోంది. మీడియా స‌మ‌క్షంలోనే ఒక‌రిపై ఒక‌రు దూషించుకున్నారు. ల‌వ‌, కుశ‌ల్లా క‌లిసి ప‌నిచేసిన ఇద్ద‌ర‌రూ భ‌ద్ధ‌శ‌త్రువుల‌య్యారు. రెండు వ‌ర్గాలుగా చీలిపోయి ఎవ‌రికి ఆధిప‌త్యపు పోరు మొద‌లుపెట్టారు. ఆ క్ర‌మంలోనే స‌వాళ్లు- ప్ర‌తిస‌వాళ్లు విసురుకున్నారు. టాలీవుడ్ స‌హా జ‌నాల్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. దీంతో `మా` ఫౌండ‌ర్ మెగాస్టార్ చిరంజీవి మ‌రికొంత మంది పెద్ద‌ల స‌మ‌క్షంలో వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ వివాదంపై ఇష్టానుసారం క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

కొన్ని మీడియా చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు ఈ గొడ‌వ‌లోకి మెగాస్టార్ ను లాగ‌డం ద్వారా టీఆర్‌పీ గేమ్ ఆడ‌డం చ‌ర్చొక‌చ్చింది. చిరంజీవి పేరును హైలైట్ చేస్తూ హెడ్డింగ్ ల‌తో సామాజిక మాధ్య‌మాల్లోనూ జోరుగా ట్రోల్ చేస్తున్నారు. యూ ట్యూబ్ ఛాన‌ల్స్ ఈ రేంజ్ లో చేల‌రేగిపోతున్నారంటే కార‌ణం ఇంటిగుట్టును బ‌య‌ట‌కు తెచ్చిన‌ శివాజీ రాజా, న‌రేష్ దే బాధ్య‌త అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఇద్ద‌రు వేర్వేరుగా మీడియాకి ఎక్కారు. ఎవ‌రికి తోచినట్లు వారు మాట్లాడారు. వాస్త‌వానికి `మా`లో వివాదాలు కొత్తేంకాదు. `మా` ప్రారంభం నుంచే రెండు వ‌ర్గాలుండేవి. కానీ అప్పుడింత‌ మీడియా లేదు. ఒక‌వేళ స‌మ‌స్య త‌లెత్తినా మీడియాకి ఎక్క‌కుండా పెద్ద‌ల ముందు ప‌రిష్క‌రించుకునే వారు. లోప‌ల ఎన్ని ఉన్నా మాట్లాడుకుని అంతా మ‌న కుటుంబ‌మే క‌దా అంటూ రాజీకి వ‌చ్చేవారు.

కానీ శివాజీ రాజా, న‌రేష్ లు ఈగోల‌కు పోయి మీడియా ముందు పంచాయితీ పెట్ట‌డంతో ఇంత ర‌చ్చ‌య్యింద‌న్న‌ది ఇన్‌సైడ్ టాక్‌. దీంతో మొత్తం ప‌రిశ్ర‌మ‌కే చెడ్డ పేరు తెచ్చిన‌ట్లు అయింది. వారిలో వారికే స‌ఖ్య‌త కొర‌వ‌డింద‌ని జ‌నం మాట్లాడుకునే లా చేసారు. అందులోనూ మెగాస్టార్ ను బాగా ఇబ్బంది పెట్టిన‌వారయ్యారు. అయితే ఈ క‌థ‌నాలు చూసి మెగాస్టార్ బాగా హార్ట్ అయ్యార‌ని తెలుస్తోంది. లోలోప‌ల ప‌రిష్క‌రించుకోవాల్సిన స‌మ‌స్య‌ల్ని తెగే వ‌ర‌కూ లాక్కోవ‌డం అవ‌స‌ర‌మా? అని ఆయ‌న విచారం వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికైనా మా పెద్ద‌లు సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments