యూఎస్ ప్రీమియర్ షో టాక్: పూరి మెహబూబా ఎలా ఉందంటే..?

Friday, May 11th, 2018, 10:21:06 AM IST

టాలీవుడ్ లో గత కొంత కాలంగా హిట్టు కోసం పరితపిస్తున్న దర్శకుల్లో సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ ముందున్నారని చెప్పాలి. చివరగా బాలకృష్ణ తో తీసిన పైసా వసూల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సరి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని ఒక డిఫెరెంట్ కథతో దర్శకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన తనయుడు ఆకాష్ తో తెరకెక్కించిన మెహబూబా సినిమా ఈ రోజు రిలీజ్ కానుంది. అయితే ముందే ఈ సినిమా ప్రీమియర్ షోలను అమెరికాలో ప్రదర్శించారు. సినిమా ఎలా ఉందంటే..

దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పినట్టుగానే చాలా రోజుల తరువాత ఒక మంచి ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఇండో పాక్ వార్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథకు ఆకాష్ పూరి తన పాత్రతో న్యాయం చేశాడనే చెప్పాలి. కొత్త హీరోయిన్ అయినా కూడా నేహా శెట్టి అద్భుతంగా నటించింది. ప్రేమ కథలను విభిన్నంగా చూపించడం సినిమాలో మెయిన్ హైలెట్. కథలో ఉండే ట్విస్ట్ చాలా బావుంటుంది. తెరపై చూస్తేనే మంచి కిక్ ఉంటుంది. ఇక పూరి మార్క్ డైలాగులు సినిమాకు ఎప్పటిలానే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడుస్తుంది. కథలో కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపించవచ్చు. ఇండో పాక్ దేశాలకు సంబందించిన ప్రేమ కథలో దర్శకుడు స్క్రీన్ ప్లే ను మెచ్చుకోవలసిందే. సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. యుద్ధ సన్నివేశాలు కూడా సినిమా కథలో కీలకపాత్ర పోషిస్తాయి. మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులను మెహబూబా ఓ విధంగా ఆకట్టుకోవచ్చు . మరి నేడు విడుదల కాబోతున్న ఈ సినిమా ఇండియాలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.

Comments